దళితులను దగా చేసిన సీఎం కేసీఆర్ : ప్రీతం
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను దగా చేసి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం. తెలంగాణ సాధించుకున్న తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాటతప్పి ఆ సీటు కూర్చు నాయ నిజాం రాజు అని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎజెన్సీ, దళిత బిడ్డల సమస్యలపై ఎస్సీ కార్పోరేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన సీఎం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కాశ్మీర్‌గా పేరున్న అదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం తెరాస సర్కార్ విఫలమైందన్నారు. యువతకు ఆదుకోవడానికి బ్యాంకుకి లింకులు లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నుండి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలను ఆదుకోవడనాకి ప్రత్యేక పథకాలు పెట్టి ఆదుకోవాలన్నారు.