మ‌ళ్లీ క‌ల‌వ‌ర పెడుతున్న క‌రోనా

అంద‌రూ అనుకున్న‌ట్టుగానే క‌రోనా చ‌లికాలంలో త‌న విజృంభ‌న చూపిస్తోంది. మ‌రోసారి ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. కరోనాలో కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ వెలుగు చూస్తోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై నిషేదాజ్ఞలు విధించేందుకు పలు దేశాలు సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా విమానాలపై నెదర్లాండ్, బెల్జియం దేశాలు నిషేధం విధించాయి. ఆ రెండు దేశాల విమానాలపై నిషేదం విధించే యోచనలో జర్మనీ, ఇటలీలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్లుహెచ్ఓ యూరప్ విభాగం హెచ్చరించింది. కరోనా వైరస్ స్ర్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.