ప‌దేళ్ల కుర్రుడి ఆలోచ‌న అంద‌ర్నీ ఆలోచింప‌జేస్తోంది

సృష్టి మూలం స్త్రీ. ఆ స్త్రీకి ఇప్పుడు స‌మాజంలో స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేదు. అయినా కానీ పోరాడుతోంది. మ‌హిళ‌ల‌కు ఇచ్చే గౌర‌వం ఎలా ఉండాలి అని ఓ ప‌దేళ్ల కుర్రాడి చెప్పిన మాట‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌తి ఒక్క‌రిని ఆలొచింప చేస‌స్తున్నాయి. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠ‌శాల‌లో 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న కుర్రాడు మ‌హిళ‌ల‌ను ఎలా గౌర‌వించాల‌ని అనే అంశంపై పోస్ట‌ర్ త‌యారు చేశాడు. స‌మాజంలో మ‌హిళ‌ల‌పై హ‌త్య‌లు, హ‌త్య‌చారాలు ఎక్కువ అవుతున్న తరుణంలో బాధ‌ప‌డుతూ మంచి ఆలోచ‌న దృక్ప‌థంతో కొన్ని అంశాల‌ను అందులో పొందుప‌రిచారు.
మ‌నం మ‌హిళ‌ల‌కు గౌర‌వం ఇవ్వాలి. వారిని చిన్న‌చూపుతో చూడ‌వ‌ద్దు. ఉన్న‌త విద్య‌ను అందించాంలంటూ ప‌దేళ్ల వ‌యసులోనే ఎంతో అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తిగా ఆలోచ‌న చేయ‌డం అనేది గొప్ప విష‌యం. దీంతో ఆ పాఠ‌శాల యాజ‌మాన్యం. ప్రేర‌ణ ఎన్‌జీవో సంస్థ వారు ఆ అబ్బాయిని అభినందించారు.