క‌ల‌క‌త్తా ఎన్నిక‌ల బ‌రిలోమ‌జ్లీస్‌ : అస‌దుద్దీన్

హైద‌రాబాద్‌కే ఆలిండియా మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ప‌రిమితం కాద‌న్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. జాతీయ స్థాయిలో పార్టీని విస్త‌రించాల‌న్న‌దే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. ఈ నేఫ‌థ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించచారు. ఈమేరకు ఏఐఎంఐఎం చీఫ్‌ ఎంపీ బెంగాల్‌ నేతలతో శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. బెంగాల్‌ ప్రతినిధులతో ఈరోజు ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక వచ్చే ఏడు జరగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేస్తామని ఏఐఎంఐఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.