తాను పుండై… మరొకరికి పండై : ఓ వేశ్య కథ
పుట్టుకతో ఎవరూ కూడా వేశ్యగా పుట్టరు. వాళ్ల ఆర్థిక, కుటుంబ పరిస్థితులు అలా మారుస్తాయి అంటున్నారు బాలీవుడ్ నటి రాఖీ సావంత్. ప్రభుత్వం వేశ్యల కోసం బలమైన చట్టాలను తీసుకవచ్చి అమలు చేయాలని కోరారు. తాను పుండై…. వేరొకరికి పండులా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
“వేశ్య అన్న పదం వినగానే మనుషుల ముఖాల్లో హావభావాలు చిత్రవిచిత్రంగా ఎందుకు మారతాయో నాకర్థం కాదు. కానీ వాళ్ల దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తున్నప్పుడు వాళ్లకు రక్షణగా ఉండేందుకు బలమైన చట్టాలను ఎందుకు చేయడం లేదు? వాళ్ల పిల్లలకు స్కూల్‌లో ఎందుకు అడ్మిషన్ దొరకడం లేదు? అని ప్రశ్నించారు. ఈ సెక్స్ వర్కర్ల వల్లే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయనుకుంటారు. కానీ వారు కుటుంబాలను కలుపుతారు. పుట్టుకతోనే ఎవరూ వేశ్య కాదన్న విషషయంతో పాటు సెక్స్ వర్కర్ల దీనస్థితిని మా వెబ్ సిరీస్ ద్వారా చూపించబోతున్నాం” అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్‌లో పలువురు నటీనటులు వేశ్యగా నటించారు. దేవదాస్‌లో మాధురీ దీక్షిత్, తవైఫ్‌లో రాతి అగ్రిహోత్రి, ఉమ్రావ్ జాన్, ముఖద్దర్ కా సికిందర్‌లో రేఖా, ఉమ్రావ్ జాన్‌లో ఐశ్వర్యా రాయ్, పాకీజాలో మీనా కుమారి వేశ్యలుగా నటించి మెప్పించారు.