వైకాపా భరితెగిస్తోంది : కాట్రగడ్డ
ఏపీలో వైకాపా నాయకులు భరితెగించి పోతున్నారని ఆరోపించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. ఇప్పటికే ఎంతో మంది ఆమాయక ప్రజలను ఇబ్బందులు పెడుతున్నవారు రోజు రోజుకు మితి మీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అప్రజాస్వామికంగా తెలుగుదేశం నాయకులపై దాడులు చేస్తూ రాష్ట్రంలో భయానక వాతవరణం సృష్టిస్తున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందా లేక రౌడీల పాలన సాగుతోందా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పర్యటనలో నల్లారి కిషోర్ పై మరియు నేతలు పై దాడి చేడయం హేయమని చర్య అని అన్నారు. వైకాపా రౌడీలు చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు.