రైతులకు అండగా ఉంటాం: జయసారధి రెడ్డి
దేశ వ్యాప్తంగా చేపట్టిన రైతు ఉద్యామానికి అండగా ఉంటామన్నారు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధిరెడ్డి. మోడీ సర్కార్ రైతులను ముంచేలా చట్టాలను తయారు చేస్తుందని విమర్శించారు. దేశం కోసం, ప్రజల ఆకలి కోసం నిత్యం తను పస్తులుంటూ… అన్నం పెడుతున్న రైతులకు ఈ దేశంలో ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే దేశ ఆర్ధిక వ్యవస్థను కొన్ని ధనిక కుటుంబాల చేతుల్లో పెట్టిన మోడీ రైతులను కూడా ఆదే తోవలో పట్టేలా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు కావాల్సినవి చేయకుండా…. కార్పొరేట్ వ్యవసాయం చేస్తే ఎలా అని విమర్శలు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సన్నవడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై దయ చూపి పంటలకు కనీస మద్దతు ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని కోరారు.