రైతులకే నా మద్దతు : కాట్రాగడ్డ
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఓ రైతుగా నా స్పందన
ఎద్దేడిసిన ఏవసం, రైతు ఏడిచ్చన రాజ్యం బాగుపడలేదు అనేది నానుడి. ఇప్పుడు భారతదేశ రైతులను చూస్తే…. అలానే అనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆగమ్యగోచరంగా తయారు చేశాయి. పైగా ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే అసంఘటితంగా ఉన్న రైతుల అభివృద్ధి ఆలోచనలు మారాయి. హర్యణా, ఛండీగర్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని రైతులు నూతన వ్యవసాయరంగ బిల్లుకు వ్యతిరేకంగా పూరించిన శంఖారవం ఢిల్లీ నుండి గల్లీ వరకు కదలించింది. రైతులకు సంఘీభావంగా తమ వంతు సాయంగా సంవత్సరమైనా… ఉద్యమాన్ని నిర్వహిస్తామని రైతులు తెలిపిన వైనం వ్యవసాయ రంగాన్ని సంఘటిత రంగంగా తీసుకువస్తున్నారని చెప్పుకోవాలి.
భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే వ్యవసాయం రంగం కీలక పాత్ర పోషిస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతులు, చిన్న, సప్నకారు రైతులు కేంద్ర ప్రభుత్వం తీసువచ్చే వ్యవసాయరంగ బిల్లుని తట్టుకునే శక్తి లేదు. ఇప్పటికే పండించిన పంటలకు సరైన మద్దత్తు ధర లేక విల విలాడుతున్నారు రైతులు. మరో వైపు పకృతి వైపరీత్యాలతో అల్లాడిపోతున్న ఈ రైతులను కేంద్రం తీసుకువచ్చే చట్టం ఆదుకుంటుందా?
కనీసం అక్షరాలు రాలయలేని నా రైతన్నలు, పక్క ఊరు వెల్లని నా రైతన్నలు రాష్ట్రం ఎల్లలు దాటి పోరుగు రాష్ట్రంలోకి వెళ్లి ఎలా పంటలన విక్రయిస్తారు. గుత్తాధిపత్యం (monopoly) ఉన్న ఈ మార్కెట్లు వ్యవసాయరంగంలో ఉన్న ఆయామక ప్రజలు తట్టుకోగలరా ?
- ఈ వ్యవసాయం రంగంలో తీసుకవచ్చిన చట్టాలను మార్చాలి
- రైతులను అభివృద్ధి చేయడానికి వ్యవసాయధారిత పరిశ్రమలు ప్రోత్సహించడానికి బదులుగా (agro based Industry)ని ప్రోత్సహిద్దామా?
- దేశంలోని ఆ 11 కుటుంబాల చేతుల్లో దేశ సంపదను పెడుదామా? లేక రైతులకు పునర్జీవం పోద్దామా?
- రైతు ఆత్మహత్యలను ఆపుదామా లేక మనమే ఆత్మహత్యలను ప్రోత్సహిద్దామా?
- మనకు అన్నం పెట్టే రైతన్నలను కార్పొరేటు వైపు మళ్లీద్దామా?
హ్యాట్సప్ రైతు ఉద్యమ నాయకులారా
దేశ రైతుల ఉద్యమం వర్ధిల్లాలి
ఈ ఉద్యమానికి సగటు రైతుగా మద్దతు తెలుపుతున్న