భాజపాలో తెజస విలినమా?
తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకి మారుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ తెరాసకు గట్టి పోటీ ఇచ్చింది భాజపా. ఒక వారం గడువులోనే ఇంత మార్పు తీసుకరావడం అంటే మాములు విషయం కాదు. గత ఎన్నికల్లో సెంచరీకి ఒక్క అడుగు దూరంలో ఉన్న తెరాసకు వన్నులో వణుకు పుట్టించింది అని చెప్పుకోక తప్పదు. అయితే భాజపా బలం రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆ పార్టీలోకి చేరికలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, తెదేపా, తెరాస నుండి చాలా మంది కమలం గూటికి చేరారు. అయితే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం గ్రేటర్ ఫలితాల తర్వాత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
గ్రేటర్ ఫలితాల అనంతరం ఓ టీవీ ఛానెలో చేపట్టిన చర్చ కోదండ రాం మాట్లాడుతూ తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని బల్లగుద్ది చెప్పారు. అయితే ఆమన వ్యాఖ్యలతో పార్టీలోని సీనియర్ నేతలు ఆశ్చర్యపోయారు. పార్టీ స్థాపించిన నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపలేక పోయింది. పార్టీల కార్యకర్తలు, నేతలు కూడా బాగా చదువుకున్న వారే జిల్లా నేతల్లో ఉన్నారు. ఇక చదువుకున్న యువత ఇప్పుడు భాజపా వైపే చూడడం ఆసక్తి రేపుతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు వరంగల్, ఖమ్మం , నల్గొండ జిల్లాలో జరిగే పట్ట భధ్రుల ఎమ్మెల్సీకి తెజస నుంచి కోదండ రాం బరిలో దిగుతారని ప్రచారం జరుగుతున్న ఎటువంటి ప్రకటన జరగలేదు.
అయితే…. కోదండం రాం బరిలో ఉన్నా…. ఆయన్ని చూసి యువత ఓటు వేయాలి తప్పా… పార్టీని చూసి
ఓట్లు రాలే అవకాశం తక్కువే అని చెప్పుకోవాలి. ఇలాంటి దశలో కోదండ రాం రాజకీయంగా ఎదగాలంటే పార్టీని భారతీయ జనత పార్టీలో విలీనం చేస్తే… తప్పా మరే అవకాశం లేదు. అలా భాజపాలో విలీనం చేసి బరిలో దిగితే గెలుపుకు తిరుగులేదు. పార్టీని విలీనం చేస్తే…. బాగుండు అని పార్టీలోని కొందరు నేతలు తమ సొంత వారి దగ్గర చెబుతున్న సమయంలో…. పార్టీ అధినేత భాజపాకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతున్నాయి.