మంత్రులలో మొదలైన వణుకు
పొలిటికల్ కెరీర్పై ఎఫెక్ట్ పడ్తుందనే ఆందోళన
సీరియస్గానే పనిచేసిన కొందరు.. ఉండీ లేనట్టున్న మరికొందరు సరిగా పనిచేయని మంత్రులపై సీఎంకు నిఘా వర్గాల రిపోర్టు,
తమకు అప్పగించిన డివిజన్లలో పార్టీ క్యాండిడేట్ ఓడిపోతరేమోనన్న టెన్షన్ కనిపిస్తోంది. ఒకవేళ రిజల్ట్స్ నెగిటివ్‌గా వస్తే.. ప్రగతి భవన్ నుంచి క్లాస్ తప్పదని, భవిష్యత్తులో పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉందని మంత్రులు ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్ గ్రేటర్ ఎలక్షన్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఒక్కో డివిజన్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఎలక్షన్ బాధ్యతలు తీసుకున్న మంత్రులు.. ప్రచారం కోసం తమ సొంత జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలను సిటీకి తరలించారు.
వారం పాటు అంతా డివిజన్లలో మకాం వేసి ప్రచారం చేశారు. కొందరు మంత్రులైతే క్యాండిడేట్ల కంటే ఎక్కువ తిరిగి, డివిజన్లలో పార్టీ పరిస్థితిని హైకమాండ్‌కు చేరవేశారు. క్యాండిడేట్తరఫున పార్టీ ఇచ్చిన ఫండ్స్‌తోపాటు సొంత పైసలు ఖర్చు చేశారు. ఇంతచేసినా పలుచోట్ల పార్టీ క్యాండిడేట్లు గెలిచే చాన్స్ లేదని టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మినిస్టర్లు ఎలక్షన్ బాధ్యతలు తీసుకున్న చాలా డివిజనల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్నట్టు చర్చ ఉంది. దీంతో కొందరు మంత్రులు తమ సొంత ఎలక్షన్‌గా భావించి సీరియస్ గా పనిచేశారని.. మరికొందరు పెద్దగా దృష్టి పెట్టలేదని పార్టీ లీడర్లు అంటున్నారు. కొందరు చుట్టపుచూపుగా వచ్చి ప్రచారం చేశారని, ఒకరిద్దరు పొద్దున ఓసారి, సాయంత్రం మరోసారి కనిపించి వెళ్లిపోయారని చెప్తున్నారు.
ఏ డివిజన్ ఏమంత్రికి ఇచ్చిన్రు
మీర్ పేట ఎర్రబెల్లి దయాకర్ రావు
చిలుకానగర్ సత్యవతి రాథోడ్
సరూర్ నగర్ జగదీశ్ రెడ్డి
హిమాయత్ నగర్ గంగుల కమలాకర్
అడిక్ మెట్ శ్రీనివాస్ గౌడ్
అంబర్ పేట నిరంజన్ రెడ్డి
పఠాన్ చెరువు హరీష్ రావు