నేటి కుట్ర కాదిది పురాణాల నాటిది

నేటి కుట్ర కాదిది
పురాణాల నాటిది.
దేవతలైనను
దేవుడికి దాసులే,
దేవుడు మగాడు కాబట్టి
అంత తన ఇష్టమే.

వైకుంఠ పురాణా,
లక్ష్మి దేవి ఎల్లపుడు
పతి పాదములను సేవించును గాని
పతి ఎన్నడూ ఆ పత్నిని సేదతీర్చలేదెందుకు?

కైలాసంలో కొలువుండు వాడు
స్మశానాన్ని శాసించు శివుడు
పార్వతికి తనలో అర్ద భాగం ఇచ్చారందురే గాని
పార్వతి తన సగ భాగాన్ని కోల్పోయిందని చెప్పరెందుకు?

శ్రీరామ చంద్రుడు
అయోధ్య రామయ్య
అంగట్లో అందరి ముందు చితిమంట పెడతాడు
సీత తిరిగి తనని ప్రశ్నించదు, పరీక్షించదెందుకు?

అమ్మాయిల బట్టలెత్తుకెళ్లిన వాడు
ఇద్దరు భార్యలు గల వివాహితుడు
వేల గోపికల్ని ఉంచుకున్న కృష్ణుడు
ద్వారకకేలా….. దేవుడయ్యెను?

యమున్నే వెంటాడింది ఓ భార్య
భర్త ఆయుస్సు కోసం
ఎ భర్త చేసాడు భార్య కోసం?
కుష్ఠి రోగియైన పతికి సేవచేస్తూ
జీవిత త్యాగం చేసిన ఓ పుణ్యం
పాతినేందుకలా చూపలేదు అనేది విచిత్రం.

దాసి బతుకులు -బానిస బతుకులే
పురాణాల్లో దేవతలవి కూడ
అంటే……కుట్రతో చేసిన పన్నాగమే ఇదంతా.
స్త్రీనీ అణచి వుంచ కల్పించిన
కల్పితం ఇదంతా !

వాళ్ళిస్టానికి వాళ్ళు రాసుకున్న గీతలు కాబట్టి
ఎ పురాణాల్లో ఎ దేవత
ఈ చెత్తని కాల్చిపారేసే దైర్యం చేయలేదు
కానీ మనం ఒకరి చెప్పుచేతుల్లో వుండే బానిసలం కాదని
మన తరపున ” బాబాసాహెబ్ “
మనుధర్మాన్ని ఎపుడో కాల్చి బూడిద చేసాడు
“పెరియార్” మనకోసం కోర్టు మెట్లెక్కాడు

మనమింక నాలుగు గోడల కిటికి లోపలి నుంచి
సహాయం కోసం దీనంగా అర్థిద్దామా…..
లేక ఇపుడైన ఆ గోడలు పగలగొట్టి వొచ్చి
ఈ పూక్కింటి పురాణాలన్నీ మన చేతుల్తో కాల్చి పరేసి
మన భుజాన వున్న రెక్కల్లో ప్రాణం పోసి
మనం కోసం మనం విహరించడం
కాస్త జీవించడం నేర్చుకుందామా??

అను శ్రీ..... 💞