రికార్డు స్థాయిలో ముగిసిన భారతీయ సూచీలు; 13,000 పైన నిలిచిన నిఫ్టీ, 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

ఐ.టి., లోహాలు మరియు ఫార్మా స్టాక్స్ నేతృత్వంలోని లాభాలతో బెంచిమార్కు సూచీలు మంగళవారం రికార్డు స్థాయిలో ముగిశాయి.

నిఫ్టీ 1.08% లేదా 140.10 పాయింట్లు పెరిగి 13,000 మార్కు పైన 13,109.05 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 1.15% లేదా 505.72 పాయింట్లు పెరిగి 44,655.44 పాయింట్ల వద్ద ముగిసింది. సుమారు 1869 షేర్లు పెరిగాయి, 974 షేర్లు క్షీణించగా, 169 షేర్లు మారలేదు.

నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో గెయిల్ (7.94%), సన్ ఫార్మా (5.74%), ఇండస్ఇండ్ బ్యాంక్ (4.94%), టెక్ మహీంద్రా (3.79%), యుపిఎల్ (3.90%) ఉన్నాయి. దీనికి విపర్యంగా, నిస్టీ (2.57%), కోటక్ బ్యాంక్ (1.63%), టైటాన్ (1.34%), బజాజ్ ఫైనాన్స్ (1.12%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (0.82%) మొదటి నిఫ్టీ నష్టాలలో ఉన్నాయి.

రంగాల ముగింపులో, పిఎస్‌యు బ్యాంక్ సూచీ 3% పెరిగింది, అన్ని రంగాల సూచికలు ఆకుపచ్చగా ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ వరుసగా 0.94%, 0.82% పెరిగాయి.

గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్.
కంపెనీ ఆక్సిటినిబ్ టాబ్లెట్ల కోసం యుఎస్‌ఎఫ్‌డిఎ నుండి తాత్కాలిక ఆమోదం పొందిన తరువాత. గ్లెన్మార్క్ ఫార్మా స్టాక్స్ 1.20% పెరిగి రూ. 477.05 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ టాబ్లెట్లను కిడ్నీ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు.

లుపిన్ లిమిటెడ్.
విల్సన్ వ్యాధి చికిత్సలో మరియు తీవ్రమైన క్రియాశీల రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపయోగించే పెన్సిల్లామైన్ మాత్రల కోసం కంపెనీ యుఎస్‌ఎఫ్‌డిఎ అనుమతి పొందింది. కంపెనీ స్టాక్స్ 2.27% పెరిగి రూ. 912.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

డిఎల్ఎఫ్ లిమిటెడ్.
గురుగ్రామ్ లో రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 90% స్వతంత్ర ఆస్తులను అంటే రూ. 300 కోట్ల విలువగల ఆస్తులను విక్రయించాలని ప్రకటించగానే, డిఎల్‌ఎఫ్ లిమిటెడ్ స్టాక్స్ 4.22% పెరిగి రూ. 195.10 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

బజాజ్ ఆటో లిమిటెడ్.
నవంబర్ 20 నాటికి బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలలో 5% పెరుగుదల నివేదించింది. సంస్థ యొక్క దేశీయ అమ్మకాలు 4% మరియు ఎగుమతులు 14% పెరిగాయి. ద్విచక్ర వాహనం మరియు త్రీ-వీలర్ తయారీదారుల స్టాక్స్ 2.16% పెరిగి రూ. 3,242.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

కెపాసైట్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్.
కంపెనీకి రేమండ్ లిమిటెడ్ వద్ద టెన్ఎక్స్ ప్రాజెక్ట్ కోసం రేమండ్ లిమిటెడ్ నుండి రూ. 148.3 కోట్ల విలువగల పునరావృత ఆర్డర్లు పొందింది. కంపెనీ స్టాక్స్ 5.35% పెరిగి రూ. 193 ల వద్ద ట్రేడ్ అయింది.

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్
సంస్థ యొక్క ట్రాక్టర్ అమ్మకాలు 56% పెరిగాయి, ట్రాక్టర్ ఎగుమతులు 79% పెరిగి 1,107 యూనిట్లుగా ఉన్నాయి. సంస్థ యొక్క ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 24% పెరిగాయి మరియు 18,212 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ స్టాక్స్ 1.47% పెరిగి రూ. 732.60 ల వద్ద ట్రేడ్ అయింది.

భారతీయ రూపాయి
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో చూసిన కొనుగోలుతో యు.ఎస్. డాలర్‌తో భారత రూపాయి 50 పైసలు పెరిగి రూ. 73.55 రూపాయలుగా నిలిచింది.

ఆకుపచ్చ రంగులో ముగిసిన గ్లోబల్ మార్కెట్లు
పెట్టుబడిదారులలో కరోనావైరస్ వ్యాక్సిన్ పై ఆశలు ఉన్నందున గ్లోబల్ మార్కెట్లు కోవిడ్ నడుమ పచ్చగా ముగిశాయి. అన్ని ప్రధాన సూచికలు అధికంగా ముగిశాయి. ఎఫ్.టి.ఎస్.ఇ ఎంఐబి 0.27%, ఎఫ్.టి.ఎస్.ఇ- 100, 2.00%, నిక్కీ 225 1.34%, హాంగ్ సెంగ్ 0.86% పెరిగాయి.