మునిగిపోతున్న నావ టీఆర్ఎస్ పార్టీ
టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక్కప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎదురులేని పార్టీ. కానీ రోజుకు రోజుకు అది మునిగిపోతున్న నావల తయారవుతుంది. గ్రేటర్ ముందు పార్టీకి సీనియర్ నేతల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడుతున్న నేతలంతా భాజపా, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అలాగే ఇప్పటికే ఎంతో మంది పార్టీలో నిరుత్సహాంగా ఉన్నారని ఆ పార్టీ నేతలే సొంతవారి దగ్గర ఘోడు వెల్లబోసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
ఇటీవల దుబ్బాకలో వచ్చిన ఫలితం కూడా పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. పార్టీలో మంచి ఇమేజ్, అందర్ని కలుపుకుపోయో న్యాయకత్వ లక్షణాలు ఉన్నా… హారీష్ రావు ఛర్మిషనే అక్కడ ఏం పని చేయలేకుండా పోయింది. ఆ ఫలితాన్ని ముందుగానే ఊహించిన అధినేత కేసీఆర్ సరైన వ్యూహంతో తన కొడుకు, కూతురుని అక్కడి ప్రచారానికి పంపియ్యలేదు. ఇది జగమేరిగిన నగ్నసత్యం. అయితే ఇటీవల హైదరాబాద్ వరదల కారణంగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఈ అవకాశాన్ని అధికార పార్టీ అందిపుచ్చుకొని ప్రతి ఇంటికి పదివేల రూపాయలు పంపిణీ చేసింది. కాగా ఈ పంపిణీలో జరిగిన అవకతవకలు, పార్టీ నేతల చూపిన చేతి వాటం అందరికీ తెలిసిపోయింది. గ్రేటర్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా… పార్టీ పడవ మునగక ముందే కేసీఆర్ వ్యుహంతో ఈ అవకాశాన్ని వదలుకోకుండా గ్రేటర్ ఫైట్‌కి సిద్దమయ్యారు.
అయితే ఇక్కడ సీఎం అనుకున్నట్లు అనుకూల పవనాలు వీచడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో ఉన్న సీనియర్ నేత, మాజీ మేయర్ తీగుల కృష్ణరెడ్డి భాజపా పార్టీలో చేరడానికి సిద్దమయ్యారు. మరోవైపు కార్పొరేటర్ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు కూడా ఇతర పార్టీలకి జంప్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ అభివృద్ది అంతా టీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పా మరెక్కడ కనిపించడం లేదు. ప్రధాన రహాదారులు తప్పా, గల్లీల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఇప్పుడు మళ్లీ ఎలా ఓట్లు అడుగుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన సవాల్ పార్టీకి పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ గట్టిగానే వాడుకుంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపణీ కూడా పార్టీకి నష్టాన్ని తెచ్చిపెట్టిన అంశమే. ప్రజల్ని పక్కనబెట్టి సినిమా రంగం వైపు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చూడడం కూడా కాస్త నష్టం చేకుర్చే అంశంగా చెప్పుకోవాలి.
ఏది ఏమైనా..వరద సాయాన్ని ఆశగా చూపి గ్రేటర్ ప్రజల మనుసు దోచుకోవడం తెరాసకు నిప్పుతో తల గొక్కునట్టే అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.











