దేవుడికే టీఆర్ఎస్ కండువా కప్పిన సీఎం కూతురు కవిత
ఎమ్మెల్సీ , సీఎం కూతురు కవిత చేసిన చర్యలు వివాదాస్పదంగా మారాయి. దీనితో హిందు నాయకులు మండి పడుతున్నారు.
ముషీరాబాద్ లోని గాంధీనగర్ లోని దేవాలయంలో వినాయకుని మెడలో TRS పార్టీ కండువా కప్పిన సంఘటన హిందూ మనోభావాలను తీవ్రంగా గాయపరచింది.
దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలి .
MLC కల్వకుంట్ల కవిత ,స్థానిక MLA మరియు కార్పోరేట్ అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై అనర్హత వేటు వేయాలి అని కోరారు
KCR మరియు TRS పార్టీ హిందువులకు క్షమాపణ చెప్పాలి.
హిందూ వ్యతిరేఖ ఎజెండాతో పనిచేస్తున్న TRS పార్టీ బరితెగించి హిందూ విశ్వాసాలను గాయపరుస్తుంది , దీనికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారు అని రావినూతల శశిధర్ VHP అధికార ప్రతినిధి అన్నారు











