ఫీడ్స్ వస్తే ఇలా చేయండి : కిమ్స్ సవీర డాక్టర్ జాషువా కాలేబ్
మూర్చవ్యాధి అవగాహన దినోత్సవం – నవంబర్ 17న 2020
డాక్టర్. జాషువా కాలేబ్.కె
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కిమ్స్ సవీర, అనంతపురం
మూర్చ వ్యాధి గ్రస్తులు ప్రపంచ జనభాలో దాదాపు 100 మిలిమన్ల మరిము భారతదేశములో 15 మిలియన్ల మంది ఉన్నారు.
మూర్చవ్యాధి మెదడులో ఉన్న నరాల కరెంట్ ప్రసరణలో భిన్నమైన మార్పులు కలగటం వలన వస్తుంది.
లక్షణాలు
- చేతులు, కాళ్లు కొట్టుకోవడం
- కళ్లు ఆర్పకుండా తేరిచి
- చేతులు, కాళ్లు నిక్కపొడుచుకోవడం
- నోటి నుండి నురుగు రావడం
కారణాలు
- పుట్టినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం
- మెదడులో మచ్చలు ఉండడం
- కొన్ని రకాల కణతులు ఉండడం
- రక్తంలో లవణాలు లేదా షుగర్ స్థాయిలు తగ్గడం
- తలకు గాయలు కావడం
- జన్యపరమైప లోపాలు
ఒక వ్యక్తికి మూర్చ వస్తున్నప్పుడు మనం గమణిస్తే ఆ వ్యక్తిని ప్రక్కకు తిప్పి పడుకోబెట్టాలి. చేతులు కాళ్లు బలవతంగా నొక్కి పట్టుకొకూడదు. తన చుట్టు ప్రక్కల పదునైన వస్తువులు ఉంచకూడదు. నోటిలో ఎటువంటి గుడ్డులు కానీ ఇతర వస్తువులు పెట్టకూడదు. భయపడకుండా వైద్య సహాయం కోసం ఫోన్ చేయండి.
మూర్చవ్యాధి గ్రస్తులు నాటు వైద్యం చేయించుకోకూడదు, ఆకులు ఆలములు తినకూడదు, శరీరంపై పచ్చబొట్లు వంటివి వేయించుకోవద్దు. తిరిగి తిరిగి మూర్చ వ్యాధి రావడం వల్ల వ్యక్తికి బుద్ది మాంద్యము మరియు కొన్ని సార్లు ప్రాణా హాని కూడా కలగవచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి
- సరైన వైద్యం తీసుకోవాలి
- మందులు సరిగా తీసుకోవాలి
- తనకు తానుగా మందులు తగ్గించడం కానీ, ఆపటం కానీ చేయవద్దు.
- మద్యం సేవించవద్దు
- ఇతర వ్యాధులకు మందులు వాడేటప్పుడు వైద్య సలహా తీసుకోవాలి
మూర్యవ్యాధి గ్రస్తులు తగు జాగ్రత్తలు పాటించి సరైన వైద్య పర్యవేక్షణలో ఉంటే… అందరి లాగే సాధరణ జీవితం జీవించవచ్చు. వివాహం చేసుకోవచ్చు. గర్భదారణ పిల్లలు కనడం చేయవచ్చు.
నవబంర్ 17వ తేదీన జాతీయ మూర్చవ్యాధి దినోత్సవంగా మనదేశం గుర్తించింది. ఈ దినోత్సవం వలన ప్రజలలో మూర్చవ్యాధిని గుర్తించి సరైన అవగాహాన కల్పించి ప్రజలను చైతన్య వంతులుగా చేయటం ప్రతి భారతీయుని కర్తవ్యం.