డీఎస్‌కి గవర్నర్ పదవి ?
ధర్మపురి శ్రీనివాస్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అందరూ డీఎస్ అని పిలుస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయంగా గడ్డుకాలం ఎదురైంది. దీంతో తెరాసలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనారు. అయితే ఎంపీగా ఉన్నా… ఎక్కడా కూడా ప్రత్యక్ష్యంగా రాజకీయాల్లో కనిపించలేదు. ఇతని కూమారుడు అరవింద్ భాజపా లోకి వెళ్లినప్పుడు డీఎస్ కూడా వెళ్తారని జోరుగా ప్రచరాం జరిగింది. కానీ అతను మాత్రం పార్టీ మారలేదు. ఇప్పటికీ తెరసలోనే కొనసాగుతున్న అతని ముద్ర కనిపించడం లేదు.
కానీ మళ్లీ ఇప్పుడు తెరమీదకి అతని పేరు వస్తోంది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో సీఎం సొంత జిల్లాలో భాజపా జెండ ఎగరవేయడంతో పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడింది భాజపా. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇంకా దూకుడు పెంచి 2023 టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు సీనియర్ నాయకులు.
ఇందు కోసం నిజామాద్ ఎంపీ అరవింద్ తండ్రికి గవర్నర్ పదవి కట్టపెట్టాలని చూస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి మరి.