క‌రోనా వ్యాక్సిన్ పై శుభ‌వార్త చెప్పిన అమెరికా

యావత్ ప్రపంచానికి అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మనీ బయోటెక్ కంపెనీ బయో ఎన్‌టెక్ సంస్థలు సోమవారం శుభవార్త తెలిపాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా టీకా వైరస్‌ను నివారించడంలో 90శాతం సమర్థత కలిగి ఉన్నట్టు ప్రాథమిక విశ్లేషణలో తేలిందని ప్రకటించాయి. ఈ టీకా మూడో దశ ట్రయల్స్ వివరాలపై ఇండిపెండెంట్ డేటా మానిటరింగ్ కమిటీ చేసిన విశ్లేషణలో విషయం వెల్లడైందని తెలిపాయి.
తొలి దశ టీకాలు వైరస్ నివారణలో కేవలం 60శాతం లేదా 70శాతం సమర్థతను కలిగి ఉంటాయని అంతా భావించారని, కానీ, తాము అభివృద్ధి చేస్తున్న టీకా 90శాతం సమర్థతను కలిగి ఉన్నట్టు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని వివరించాయి. ఈ రోజు శాస్త్ర విజ్ఞానానికి, యావత్ మానవాళికి గొప్ప రోజు అని, ఫేజ్ 3 ట్రయల్స్ ఫస్ట్ సెట్ రిజల్ట్స్ తమ టీకా కరోనాను ఎదుర్కోగలదని నిరూపించాయని ఫైజర్ చైర్మన్, సీఈవో డాక్టర్ అల్బర్ట్ బౌర్లా అన్నారు.