హైద‌రాబాద్‌కి స‌ముద్రాన్ని తెచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌కే ద‌క్కుతుంది : బ‌ండి సంజ‌య్

తెలంగాణపై ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్ ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపలేదన్నారు. తాడ్‌ బండ్ సిక్‌ విలేజ్ హాకీ గ్రౌండ్స్‌లో ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన సభకు కిషన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డ్ వైస్ ఛైర్మన్ రామకృష్ణ, బానుక మల్లికార్జున్, పలువురు టీఆర్ఎస్ నాయకులు కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇచ్చాడో కేటీఆర్ చెప్పాలన్నారు. పేదలకు ఇవ్వాల్సిన రూ. 10,000లను కూడా కేటీఆర్ అనుచరులు తన్నుకుపోతున్నారని.. హైదరాబాద్ ‌కు సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్ ‌దే అన్నారు. హైద్రాబాద్ ‌లో గుంతలు లేని రోడ్లు కేటీఆర్ చూపించగలడా?. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే వందల కాలనీలు నీట మునిగాయన్నారు. ప్రజలకు అబద్దాలు, అవాస్తవాలు చెప్పటం కేటీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు.
వరదలను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. విపత్తు తక్షణ సాయంగా తెలంగాణకు కేంద్రం రూ.224 కోట్లను పంపిందన్నారు. ఎన్నికలపై ఉన్న ద్యాస ప్రభుత్వానికి ప్రజల బాగుపై లేదు. వరద నష్టంపై సమగ్ర నివేదికలు పంపాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. బీజేపీని బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపలేదని.. తెలంగాణ రోడ్ల కోసం కేంద్రం రూ. 202 కోట్లు ఇచ్చిందన్నారు. వరద బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధ్యతారాహిత్యమని.. హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించిన రూ.67 కోట్లు ఎటు పోయాయో కేటీఆర్ చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో తండ్రీ కొడుకుల ప్రభుత్వాన్ని తరిమికొడతామని హెచ్చరించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. హైద‌రాబాద్ స‌ముద్రాన్ని తీసుక‌వ‌చ్చిన ఘ‌నత సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.