అసెంబ్లీలో అడుగు పెట్టేది రఘునందన్‌రావే : అరుణ
రేపటి ఉప ఎన్నికల ఫలితాల్లో భాజపా జెండ ఎగరడం ఖయామన్నారు సిద్దిపేట జిల్లా భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ రెడ్డి. ఇక కేసీఆర్ గడీల రాజ్యం ఇక్కడి నుండే కూలడం మొదలవుతుందని హెచ్చరించారు. ఇక అవినీతి పరులైన తెరాస నేతల వివరాలు అసెంబ్లీలో రఘునందన్‌రావు బయట పెడుతారని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా వస్తున్న సర్వేల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ వివరాలన్ని భాజపాకే మొగ్గుచూపుతున్నాయన్నారు. అందుకే తెరాస నేతల ఏం చేయాలో అర్ధంకాక తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ వచ్చిన తర్వాత పార్టీలో మంచి మార్పులు వచ్చాయని తెలిపారు.