అడవిలో యువకుడి దారుణ హత్య
డెక్కన్ న్యూస్, ఆదిలాబాద్ ప్రతినిధి, సయ్యద్ ఖమర్ :
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోన్న గ్రామానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.మండలంలోని పోన్న గ్రామానికి చెందిన బగునూరే జ్ఞానేశ్వర్( 32 ) దారుణ హత్యకు గురయ్యాడు.స్థానికులు కుటుంబ సభ్యులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి … మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన జాదవ్ శ్రీనివాస్ ఇచ్చోడ మండల కేంద్రంలో మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.పోన్న గ్రామానికి చెందిన బగునూరేజ్ఞానేశ్వర్ ఇద్దరు మంచి మిత్రులు కావడంతో శుక్ర వారం సాయంత్రం జాదవ్ శ్రీనివాస్ ఆయనకు ఫోన్ చేసి ఇచ్చోడకు రావాలని కోరడంతో ఆయన అక్కడికి వెళ్లిన తర్వాత ఒక గార్డెన్లో విందు చేసుకున్నారని,ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకోవడంతో జాదవ్ శ్రీనివాస్,జానేశ్వర్ ను హత్య చేసి రాత్రి ఒక వాహనంలో మృతదేహాన్ని మహారాష్ట్రలోని మాండవి గ్రామంలోని అటవీ ప్రాంతంలో పోదలో దాచిపెట్టారని తెలిపారు.కుటుంబ సభ్యులు ఆదివారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జాదవ్ శ్రీనివాస్ ను పోలీసులు తనదైన శైలిలో విచారింగా జ్ఞానేశ్వర్ ను హత్య చేసినట్లు స్నేహితుడు అంగీకరించారు.పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని సంఘటన స్థలంకు చేరుకొని మృతదేహంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హత్యకు సంబంధించిన పూర్తి వివరణ తెలియరాలేదు.దీంతో ఇచ్చోడ సీఐ కంప రవీందర్ ను సంప్రదించగా పూర్తి పూర్తి వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడిస్తామన్నారు.











