ఏజెన్సీలో వ్యాపారి నిలువు దోపిడీ

డెక్క‌న్ న్యూస్‌, ఆదిలాబాద్ ప్ర‌తినిధి, స‌య్య‌ద్ ఖ‌మ‌ర్ :

ప్రభుత్వం మనదేశంలోనే తయారైన స్వదేశీ వస్తువులను కొనాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కూడా కొందరు పక్కా ప్లాన్ ప్రకారం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం కోసం కొత్త తరహా మోసం చేస్తున్నారు.. విదేశాల నుండి తక్కువ ఎం.ఆర్.పి కి వస్తువులను మనదేశానికి దిగుమతి చేసుకుంటారు ఇలా తక్కువ ఎం.ఆర్.పి తో దిగుమతి చేసుకోవడం వల్ల ఆ వస్తువుకు దిగుమతి సుంకం తక్కువ పడుతుంది.దిగుమతి అయిన తర్వాత అదే వస్తువుకు ఎం.ఆర్.పి మార్చి అధిక ధరకు విక్రయిస్తారు.తర్వాత వారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ఆ వస్తువును అధిక ధరకు అమ్మి పొందుతున్నారు లాభం పొందుతున్నారు వివరాల్లోకి వెళితే…
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వ్యాపారుల దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోతోంది.అసలు కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారు.ఇచ్చోడ మండల కేంద్రంలో కోహినూర్ అనే ప్రముఖ దుకాణంలో ఒక వస్తువు యొక్క ధర 173 రూపాయలు ఉంటే దానిని 660 రూపాయలు ఫిక్సడ్ రేట్ పేరిట అమ్ముతున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఇలా దోపిడీ చేస్తున్న అధికారులు దృష్టి సారించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిర్ణిత ధర కంటే అధిక మొత్తంలో అమ్మి వినియోగదారుల ను మోసం చేస్తున్న వ్యాపారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.