విశాఖ మీద ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్
విశాఖ నగరాన్ని రాజధానికి అనుకూలంగా తీర్చిదిద్దడంపై జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడుతోంది. ఈ విషయాన్ని పరోక్షంగా మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాజధానికి అనుకూలంగా అనేక నిర్మాణాలను విశాఖపట్నం ప్రాంతంలో ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నగర సుందరీకరణ గురించి మరింత శ్రద్ధ పెడుతున్నట్లుగా అక్కడి మంత్రి అవంతి శ్రీనివాసరావు సంకేతాలు ఇచ్చారు. విశాఖ విద్యుత్తు ట్రాఫిక్ సమస్యలను పూర్తిగా పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉన్నదని ఆయన ప్రకటించారు.
త్వరలోనే ఎన్ఏడి ఫ్లైఓవర్ ను పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని అవంతి శ్రీనివాసరావు ప్రకటించారు. దానితో పాటు బీచ్ కారిడార్ ను మరింత అందంగా తీర్చిదిద్దడం గురించి కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది అని అన్నారు. బీచ్ ట్రాఫిక్ను తగ్గించేందుకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది అన్నారు. దానికి తగ్గట్టుగా బీచ్ ప్రాంతంలో మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని కూడా మంత్రి ప్రకటించారు.
ఇప్పటికే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ రకమైన పరిపాలన రాజధానితోపాటు పర్యాటక రాజధానిగా కూడా నగరాన్ని తీర్చిదిద్దాలనే దిద్దడం ప్రభుత్వ ఆలోచన గా ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.