తెలంగాణ కేబినెట్‌లో ఒక్కరు కాదు ముగ్గురు మంత్రులు ఔట్?
తెలంగాణ రాజకీయాల్లో వాతవరణం ఒక్కసారిగా వేడుకుతున్నాయి. అందరు అనుకున్నట్లు తెలంగాణ మంత్రివర్గం నుంచి ఒక్కరు కాదు ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకుతున్నారని సమాచారం. ఇప్పుడు ఇదే వార్త రాష్ట్రంలో చక్కర్లు కొడుతోంది. అందురు అనుకున్నట్లు కరీంనగర్ జిల్లాకు చెందిన రాసలీల మంత్రితో మరో ఇద్దరి కూడా తీసుకవెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇటీవల నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన సీఎం బిడ్డ కవిత కోసం ఆ రాసలీల మంత్రిని టార్గెట్ చేశారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఒక్క మంత్రిని తీసేస్తే బిడ్డ కోసం కేసీఆర్ చేస్తున్న కుట్ర అని పార్టీకి చెడ్డ పేరు వస్తుందని అతనితో పాటు మరో ఇద్దరిని టార్గెట్ చేసి వారిని కూడా తీసేయనున్నట్లు సమాచారం.
కరీంనగర్ జిల్లాకు చెందిన రాసలీల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంగుల కమలాకర్, మహబూనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డిలకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచరం. అయితే ఈ ముగ్గురి స్థానంలో ఎవరికి చోటు కల్పిస్తారనేది ప్రశార్థకంగా మారింది. అయితే ఇప్పటికే పార్టీలో చాలా మంది అశావాహులు ఉన్నారు. ఇందులో మంత్రి యోగం దగ్గే అవకాశం ఎవరికి ఉందో అది కేసీఆర్ కి ఒక్కరికి మాత్రమే తెలుసు. ఈ విషయంలో తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారని బొగట్ట. గంగుల తప్పించడానికి కారణం ఉన్నా… మరో ఇద్దరికి ఏ కారణం చేత తప్పిస్తారు అనేది ప్రశ్న. అయితే ఇటీవల కాలంలో శ్రీనివాస్ గౌడ్ అతిగా మాట్లాడడమే అతని కొంప ముంచేలా ఉంది. ఇక ప్రశాంత్ రెడ్డి సంగతి అంతే.
కాగా ఇందులో ఎమ్మెల్సీ కవితకు మాత్రం ఎటువంటి అనుమానం లేదు. ఇప్పడంతా మరో ఇద్దరు ఎవరని అందరి మదిలో ప్రశ్న. రెండో సారి అధికారంలోకి వస్తే తప్పకుండా వరంగల్ జిల్లా నుంచి కాపు వర్గానికి చెందిన ద్యానం వినయ్ భాస్కర్‌కి రోడ్డు రవాహా శాఖ మంత్రి ఖాయం అయినట్టు అప్పుడు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పడు అతనికి మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌లో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దానం నాగేందర్‌ని మంత్రిని చేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.