దుబ్బాకలో గెలిచేది ఈ పార్టీనే
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఉన్నది చివరి అంకమే. అందరూ అనుకున్నట్టుగానే తెరాస, భాజపాల మధ్యనే గట్టి పోటివస్తుందనే చెప్పాలి. ఓ వైపు అధికార పార్టీ అన్ని విధాల అందరినీ ఉపయోగించి జనాలకు దగ్గరయ్యోలా చూసింది. కానీ మంత్రి హారీష్‌రావును కూడా అక్కడక్కడ ప్రజలు అడ్డుకున్నసంఘటనలు మనం చూశాం. ఇక్కడే తేలిపోయింది. దుబ్బాకలో ఎవరూ గెలుస్తారనే విషయం.
కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఎక్కడ లేని విధంగా కష్టపడింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నేతలందరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓ వైపు అరెస్ట్‌లు, నిరసనలు, డబ్బుల పంపిణీ హడవుడి అంటూ లేని ప్రచారాన్నితెరాసనే భాజపా కల్పించింది అని మనకు తెలుసు. భాజపా కూడా శాయశక్తులు కష్టపడి, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున్న ప్రచారం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. పోలింగ్ ముందు ఐదు రోజులు తమ ముఖ్య నేతలతో నిర్వహించిన ప్రచారం తమ విజయానికి దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.ఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. రాష్ట్ర మంత్రులకు అహంకారం తలకెక్కిందని, టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికుట్రలు పన్నినా దుబ్బాకతో బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్ తెలిపారు.