సీఎం జగన్‌పై మండిపడ్డ చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్‌కు ఏ మాత్రం అవగాహాన లేదని మండిపడ్డారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమలను నీరు అందించేలా ప్లాన్ చేస్తే వాటిపై దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. నీతి ఆయోగ్ సూచన మేరకే పోలవరం ప్రాజెక్ట్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు తమను ఇబ్బంది పెట్టెలా మాట్లాడటం తగదని, గోదావరి, కృష్ణా నదులను ఏకం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని గతంలో యూపీఏ ప్రభుత్వం చెప్పిందన్నారు. తర్వాత 2019లో రూ.55వేల కోట్ల అంచనాను సాంకేతిక సలహా కమిటీ ఆమోందించినట్లు నాడు ప్రశ్నించిన ఎంపీలకు కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. నిర్మాణం జాప్యమయ్యే కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరగడం సహజమన్నారు. సీఎం జగన్‌కు ప్రాజెక్టు గురించి అవగాహన లేకపోవడం వల్ల రాజకీయం చేస్తున్నట్లు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.