మోడీపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన హరీష్ రావు

మోడీ సర్కార్ పై తెలంగాణ ఆర్ధికమంత్రి హరీశ్ రావు మరో సారి తన అక్కసు వెళ్లగక్కరు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పదే పదే మోడీ సర్కారు పై తన వ్యతిరేకతను చూపిస్తున్నారు. తాజాగా నార్సింగ్ మండలంలో ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. టీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆసరా పెన్షన్లు రూ.30,423 కోట్లలో కేంద్రం ఇచ్చింది రూ.1,147 కోట్లు మాత్రమేనన్నారు. కేసీఆర్ కొండంత ఇస్తే… కేంద్రం ఇచ్చింది గోరంత మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదన్నారు.