హరీష్‌రావు మంత్రి పదవి ఉండనుందా ?
దుబ్బాక ఉప ఎన్నికలు మంత్రి హారీష్‌రావు మెడకు చుట్టుకున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆ మంత్రి పదవిలో వేరేఒకరు చేరిపోయారని ఇక మూహుర్తం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. అసలు దుబ్బాకకు , మంత్రి పదవికి ఏంటీ సంబంధం అనుకుంటున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే మరి.
రాష్ట్ర వ్యాప్తంగా కాదు కాదు దేశ వ్యాప్తంగా ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల మాటే మారుమోగుతోంది. ఈ ఉప ఎన్నికలకు అంతటి ప్రాధాన్యత కల్పించింది తెరాస అనడంలో ఎటువంటి సందేహాం లేదు. రాంలింగారెడ్డి చనిపోతే ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికను అధికార పార్టీ తెరాస ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం సొంత జిల్లా కావడంతో ఎక్కడా పట్టు కొల్పోవద్దు అనే ఉద్దేశ్యంతో ఈ ఎన్నికలో మళ్లీ కారు జోరు చూపించాలని ఊవ్విళ్లురుతుంది. అయితే ఈ అమలు దశలో కాస్త దిగజారుడు పనులు అధికార పార్టీ చేసిందనడంతో ఎటువంటి సందేహాం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం, రఘునందన్ మామా ఇంట్లో సోదాలు చేయడం ఈ రెండు పనులు ప్రజల్లో తెరాస మీద తీవ్ర వ్యతిరేకతను తీసుకవచ్చిందని అనడంలో ఏ మాత్రం సందేహాం లేదు అని చెప్పుకోవచ్చు.
ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే మంత్రి హారీష్‌రావు ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాగా గత కొన్ని రోజుల నుండి దుబ్బాకలో కమలం పార్టీ బలపడుతుందని నివేదికలు ప్రభుత్వానికి చేరినట్టు సమాచారం. కాగా ఎలాగైన గెలవాలని కృతనిశ్చయంతో ఛాయ శక్తుల తెరాస ప్రయత్నం చేస్తోంది. కాగా ఈ ఉప ఎన్నికలకు , మంత్రి హారీష్‌రావు పదవికి ముడి పెట్టినట్లు సమాచారం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఒడిపోతే , హారీష్ రావుని బాధ్యుడిని చేసి మంత్రి పదవి నుండి తప్పించాలని
కేసీఆర్ చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అందుకే కల్వకుంట్ల ఇంటి నుంచి ఎవరూ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదని ఇదే అందుకు ఊదహారణ అని అంటున్నారు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.