చదువుకున్న బిడ్డలను ఆగం చేసిన సర్కార్ : జయసారధిరెడ్డి
తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగం వస్తుందని అనుకున్నాం కానీ తెరాస సర్కార్ అందరనీ ఆగం చేసిందని విమర్శించారు ఎమ్మెల్సీ అభ్యర్ధి జయసారధి రెడ్డి. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మన ఉద్యోగాలు మనకొస్తాయని యువకులు కొండంత ఆశతో ఎదురు చూస్తే కేసీఆర్ అందరికీ పంగ నామాలు పెట్టారని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరైన విపక్షం లేక తెరాస నాయకులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, పేదలను విస్మరిస్తూ వారి సామాజిక వర్గం వారికే పట్టం కడుతున్నారని విమర్శించారు. ఏ ఒక్క పథకం కూడా గ్రామా స్థాయిలో అమలు కావడం లేదన్నారు. చదువు చెబుతున్న ఉపాధ్యాయులు ఆలోచించి ఎర్రజెండ చేతబూనిన తనని చట్ట సభలకు పంపితే సమస్య పరిష్కారం అవుతాయన్నారు.