గిద్దలూరులో ప్రజలు మార్పు కోరుకుంటున్నారా?
డెక్కన్ న్యూస్, ఏపీ బ్యూరో :
గిద్దలూరు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎక్కడా అబివృద్ధి బాటలో ముందుడుగు వేయని ప్రాంతం. ఆపార ఖనిజ సంపదలు, నీరు లేకున్న తక్కువ నీటి వసతితో చేసే వ్యవసాయ పంటలు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యమైన నెమలి గుండ్ల రంగనాయక స్వామి జలపాతం. అబ్బుర పరిచే నల్లమల అడవి ప్రయాణం. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. కానీ అబివృద్ధిలో మాత్రం వెనకంజలోనే ఉంది. ఇందుకు బలమైన రాజకీయ నాయకుడు లేకపోవడమేనా కారణం. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి.
ఆపార రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో కనీస అభివృద్ధికి కూడా అడుగులు ముందుకు పడడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే మూడు పార్టీలు మారినా… ఆయన చేసిందేమి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఎన్నికల హడవుడి లేకున్నా ప్రజలు గిద్దలూరులో మార్పు కోరుకుంటున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. యువ నాయకులు తెర మీద రాజకీయం చేయాలని కోరుకుంటున్నారు. ఎటువంటి ఎన్నికల హడావుడి లేకున్నా ఈ మార్పు అనే అంశం తెరమీదకు ఎందుకు వచ్చినట్లు అన్నది గిద్దలూరు ప్రజల్లో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.