సుడిగాలి సుధీర్‌కి కరోనా పాజిటివ్ ?
సుడిగాలి సుధీర్ పరిచయం అక్కర్లేని పేరు. అతి తక్కువ సమయంలో తన కామెడీతో ప్రతి ఒక్కరిని తన అభిమానులుగా చేసుకున్నాడు. అంతే స్ధాయిలో నిందలు మోస్తున్న వ్యక్తి. బుల్లితెర మీద గిల్లికజ్జాలు పెట్టిస్తున్న యువ కథానాయకుడు సుడిగాలి సుధీర్. అయితే గత కొన్ని రోజులగా రష్మీతో ఎఫైర్ గురించి చాలా మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా అడుగుతుంటారు. ఆ రూమర్లలో నిజం లేదని ఎప్పటికప్పుడు సుధీర్ వివరణ ఇస్తాడు కూడా. ఇప్పుడు తాజాగా సుధీర్ పై మరో వార్త హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే ఈ మధ్య సుధీర్ కరోనా బారిన పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కరోనా బారిన పడి ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడని తెలుస్తుంది. డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుధీర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలుస్తుంది. సుధీర్ కు కరోనా పాజిటివ్ రావడంతో తన కుటుంబం మొత్తానికి కరోనా టెస్టులు చేయించారని, వారికి మాత్రం నెగిటివ్ వచ్చిందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పలు సినిమాలకు, టీవీ షోలకు కమిట్ అయిన సుధీర్ త్వరగా కోలుకొని మళ్ళీ ప్రేక్షకులను ఆనందింపచెయ్యాలని కోరుకుందాం.