మళ్ళీ మొదలైన మావోల అలజడి

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మావోల అలజడి మొదలైనది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కుంబింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ములుగు జిల్లా ఎస్పీ మాటల్లో…

తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా యాక్షన్ టీంలను,మావోయిస్టు దళాలను చత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా మాకు విశ్వసనీయ సమాచారం కలదు.ప్రభుత్వ ఆస్తులను మరియు పోలీసులపై దాడి చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు సమాచారం కలదు.ఈ సమాచారం మేరకు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో ములుగు జిల్లా ప్రత్యేక బలగాలు(special party) మరియు గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహించడం జరుగుతుంది.ఇందులో భాగంగానే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు మగ మావోయిస్టులు మరణించడం జరిగింది. పోలీసు బలగాలు తాడువాయి, పసర , మంగపేట తదితర ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టులు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే ఉంటారు. తదుపరి సమాచారం తెలుపగలము

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
ములుగు జిల్లా.