హీరోయిన్ ప్రణీత పేరుతో 13.5 లక్షలకు టోకరా
మెసగాళ్లకు వాళ్లు, వీళ్లు అంటూ తేడా లేదు. వచ్చినందా దోచుకోవడమే వారి అలవాటు. కనులు కనులను దోచాయంటా సినిమాలో చూపించనట్లే. విలాస జీవితాలకు అలవాటు పడ్డవారు టెక్నాలజీని ఉపయోగించి మోసం చేయడంలో ఆరితేరుతున్నారు. ఇక సినిమా అంటేనే క్రేజ్. దాన్ని ఆసరా చేసుకుని మోసం చేసేవాళ్లూ, మోసపోయేవాళ్లూ ఈ రంగంలోనే ఎక్కువ. సెలబ్రిటీ హోదాలో ఉన్న వారి దగ్గరికి వెళ్లి అడిగితే పోయేదేముందని వారు ఫోటులు తీయించుకునే అవకాశం ఇస్తారు. ఆ ఫొటోలను చూపి వారితో తమకు ఎంతో దగ్గర సంబంధం ఉందని మోసం చేసేవారు చాలా ఎక్కువ. తాము ఫలానా హీరోయిన్ మేనేజర్లమంటూ కూడా మోసం చేసేస్తూ ఉంటారు. అలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ ప్రణీత పేరుతో ఓ 15లక్షల డీల్ జరిగిందంటే ఎవరైనా నమ్మగలరా? ఆమె పేరు చెప్పి ఇద్దరు వ్యక్తలు ఈ డబ్బు దోచుకెళ్లారట. అలా మోసపోయింది మాత్రం వ్యక్తలు కాదు సుమా.. ఏకంగా ఓ కంపెనీనే. అది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ. మహ్మద్ జునాయత్, వర్ష అనే ఇద్దరు తమను తాము ప్రణీత మేనేజర్లుగా పరిచయం చేసుకున్నారు. డ్రెస్ కోడ్ ను నీట్ గా మేనేజ్ చేసుకున్నారు. నాలుగు ముక్కలు ఇంగ్లీషు మాట్లాడారు. వీరి మాటలను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మాడు. ప్రణీత బెంగళూరులోని ఓ హోటల్ లో ఉందని, రూ. 15 లక్షలు ఇస్తే ఆమెను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తామని నమ్మించారు. అంతకంటే కావలసిందేముందని ఎగిరి గంతేశాడు ఆ వ్యాపారి. ఇక తన రియల్ ఎస్టేట్ కంపెనీ దూసుకుపోతుందని కూడా భావించాడు.
వారు అడిగినట్టుగానే డిల్ కుదుర్చుకున్నాడు. ముందుగా 13.50 లక్షలు వారికి చెల్లించాడు. అగ్రిమెంటు మీద సంతకం పెట్టించి తర్వాత మిగతా డబ్బు తీసుకుంటామని వారు వెళ్లిపోయారు. ఎంతకీ వారు రాకపోవడంతో తాను మోసపోయినట్లు బిల్డర్ గ్రహించాడు. చేసేదిలేక బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైట్ కాలర్ మోసాలు ఎలా ఉంటాయో ఈ ఉదాహరణ చాలు. వేషాల పేరుతోనూ, సినిమాల పేరుతోనూ ఇలా ఛీటింగులు చేసేస్తూ ఉంటారు.