విదేశీ అమ్మాయిలతో కొత్త ఒరవడి
డెక్కన్ నిఘా బృందం:
హైదరాబాద్ నగరంలో కొత్త ఒరవడి కొనసాగుతోంది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో విదేశీ అమ్మాయిలతో మసాజ్ సెంటర్లు కొత్త సంస్కృతికి అజ్యం పోస్తున్నాయి. రువాన్ స్పా, స్పా స్పేస్, గ్లోబల్ ఎలైట్, మోరా స్పా పేర్లతో ఉన్న స్పా సెంటర్ల లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో బంజారాహిల్స్‌లోని పలు స్పా, మాసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించినా తమ పంథాన్ని మార్చుకోవడం లేదు. బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని గ్లోబల్ ఎలైట్ స్పా, రోడ్ నెంబర్ 12 లోని రువాన్ స్పా, స్పా స్పేస్, రోడ్ నంబర్ 13లోని మోరా స్పా నిర్వహకులు ఏకంగా విదేశీ అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు.కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్పాలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా పలు స్పా సెంటర్ల నిర్వాహకులు ఏమాత్రం పాటించడం లేదు. కస్టమర్ కౌంటర్ ఫీ చెల్లించి లోపలికి వెళ్లిన తరువాత థెరపిస్టులతో ఇష్టం వచ్చినంత డబ్బు అప్పజెప్పి తమకు కావాల్సిన ఆనందాన్ని పొందుతున్నారని విశ్వసనీయ సమాచారం. అదే విధంగా బంజరాహిల్స్‌లోని డిగ్నిటి బ్యూటీ సెంటర్, రోడ్ నెంబర్ 10లోని నిర్వాణ స్పాలో రెండువేలు ఇస్తే పూర్తి నగ్నంగా..ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా అమ్మాయితో మాసాజ్ చేయిస్తున్నారని సమాచారం. గతంలో పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా….స్పా సెంటర్ల నిర్వాహకుల తీరు మారకపోవడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధనవంతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ స్పా సెంటర్ల బిజినెస్ మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోంది. త్వరలో నిబంధనలు ఉల్లంఘించి కొనసాగుతున్న పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట్, బంజరాహిల్స్, జూబ్లీహిల్స్ లోని పలు స్పాలపై దాడులు నిర్వహించడానికి యత్నం చేస్తున్నట్లు బహిరంగ సమాచారం.