ఏం చేస్తారో తెలియ‌దు గెల‌వాలంతే : కేటీఆర్‌

మీరు ఏం చేస్తారో తెలియ‌దు నాకు, ఇక్క‌డ మాత్రం గెలిచి తీరాలంతే అని గ‌ట్టిగా చెప్పాడు. మంత్రి కేటీఆర్‌. రానున్న గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేస్తారో… ఎలా చేస్తారో తనకు తెలియదని, సగంపైన స్థానాలు టీఆర్ఎస్ సొంతం కావాలని గట్టిగా హెచ్చరించారు. ప్రగతి భవన్ లో నగర నాయకులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అందరితోనూ బహిరంగ సమావేశం నిర్వహించిన సూచనలు, సలహాలు ఇచ్చారు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు నిర్వహించారు. ఆ తర్వాత కార్పొరేటర్లను, ఇతర చిన్న చిన్న నాయకులను సమావేశ మందిరం నుంచి వెలుపలికి పంపించి వేశారు. అనంతరం నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సీహెచ్.మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు నగరంలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాస్త కఠినంగా మాట్లాడిన కేటీఆర్ సమావేశంలో పాల్గొన్న అందరికి టార్గెట్ లు ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.