గెలవకపోతే మీ పదవులకు ఎసరే

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించాల్సిందేనని, మీమీ నియోజకవర్గాల పరిధిలో విజయం సాధించే బాధ్యత మీదేనని మంత్రులు, నాయకులకు మంత్రి తెగేసి చెప్పినట్లు సమాచారం. “మీ పరిధిలో మీరు విజయం సాధించాల్పిందే. అలా కాని పక్షంలో పార్టీ మరొకరిని చూసుకుంటుంది. పార్టీలో పని చేసే వారు చాలా మందే ఉన్నారు. మేం తప్ప దిక్కులేదు అని భావిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు “ అని మంత్రి కే.తారక రామారావు సీరియస్ గానే స్పందించినట్లు చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన అందరి వివరాలు తన దగ్గర ఉన్నాయని, ఎవరిని ఎలా పైకి తీసుకురావాలో తనకు తెలుసునని కేటీఆర్ అన్నట్లు సమాచారం. అలాగే పార్టీ కోసం అహర్నిశలు పని చేసే వారికి పదవులు ఇచ్చి గౌరవించడం కూడా పార్టీకి తెలుసని కేటీఆర్ అన్నట్లు చెబుతున్నారు.