జీకాట్ సదస్సులో ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై
బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిశ్శబ్ద విప్లవం ద్వారా సాధించేందుకు కృషి చేస్తున్న గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ.. (జీకాట్) అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి, ఐక్యరాజ్యసమితిలో భారతదేశంతో సహా భూటన్, శ్రీలంక, మాల్దీవులకు మహిళా ఉప ప్రతినిధిగా వ్యవహరిస్తున్న నిషితా సత్యం సహా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థులు కొందరు కలిసి 2017లో ఏర్పాటుచేసిన స్వచ్ఛంద సంస్థే జీకాట్. ప్రధానంగా గ్రామీణులను బంధవిముక్తులను చేయడం ఈ సంస్థ ప్రధానోద్దేశం. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామోదయ బంధుమిత్ర అవార్డులను ఈ సంస్థ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, అనుబంధ పనులే జీవనాధారంగా చేసుకున్నవారి జీవితాలను మెరుగుపరిచేందుకు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థల సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తున్నారు.
జీకాట్ సంస్థ అక్టోబరు 1, 2, 3 తేదీలలో సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలవరకు ఆన్‌లైన్ సదస్సు నిర్వహిస్తోంది. అందులో ప్రధానంగా ఉండే కార్యక్రమాలివీ..
గ్రామీణ మోనోగ్రాఫ్‌లు తయారుచేయడానికి టెక్నాలజీ ప్లాట్‌ఫాం ప్రారంభం
కొత్త వరల్డ్ ఆర్డర్ కోసం అంతర్జాతీయ డిక్లరేషన్
గ్రామోదయ బంధుమిత్ర పురస్కార గ్రహీతలతో మాటామంతీ
పురస్కార గ్రహీతల వివరాలతో కూడిన సావనీర్ ఆవిష్కరణ
ఈ సదస్సులో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పాటోల్, తెలంగాణ ప్రణాళికాబోర్డు వైస్ ఛైర్మన్ బి. వినోద్ కుమార్, తెలంగాణ జలవనరుల సంస్థ ఛైర్మన్ వి. ప్రకాష్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ డబ్ల్యుఆర్ రెడ్డి పాల్గొని గ్రామీణాభివృద్ధికి తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు పుణెలోని ఎంటీ స్కూల్ పూర్వవిద్యార్థి అయిన వసంత్‌కుమార్ దమస్తపురం (ఢిల్లీ వసంత్) జీకాట్ వ్యవస్థాపనలో కీలకంగా వ్యవహరించారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో.. వసంత్.. 2007 సంవత్సరంలో తన సొంత పట్టణమైన జహీరాబాద్ నుంచి న్యూఢిల్లీకి 2,140 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
బాపూజీ 150వ జయంతి సందర్భంగా జీకాట్ సంస్థ గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలు ఏర్పాటుచేసింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, గ్రామాల స్వయంసమృద్ధి తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కృషిచేస్తున్న వ్యక్తులు, సంస్థలను ఈ అవార్డులతో సత్కరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి సేవ చేసినవారికి ఈ ఏడాది నుంచి ప్రతియేటా అందించనున్నామని ఢిల్లీ వసంత్ తెలిపారు.
ఈ ఏడాది అవార్డు గ్రహీతలలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందడుగు వేయించేందుకు కృషిచేస్తున్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. కరోనా కారణంగా ఈసారి సదస్సును ఆన్‌లైన్ వేదికగా నిర్వహిస్తుండటంతో అవార్డు గ్రహీతలను ఆన్‌లైన్ సదస్సులో పరిచయం చేసి, తర్వాత వారికి ఆయా జ్ఞాపికలను కొరియర్ ద్వారా పంపనున్నారు. అవార్డులు పొందినవారి వివరాలు ఇలా ఉన్నాయి…
- పద్మభూషణ్ డాక్టర్ విజయ్ భత్కర్, పరమ్ సూపర్ కంప్యూటర్ ఆవిష్కర్త, ప్రముఖ విద్యావేత్త
- పద్మశ్రీ ఎస్.పి. వర్మ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ (జీజీఎఫ్) ఛైర్మన్, జమ్ము కాశ్మీర్
- విలాస్ షిండే, సహ్యాద్రి ఫామ్స్ (ఎఫ్‌పీఓ) డైరెక్టర్, మహారాష్ట్ర
- బి. వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు
- డాక్టర్ జి.బి.కె. రావు, ప్రగతి గ్రీన్ మెడోస్, రిసార్ట్స్ లిమిటెడ్ ఛైర్మన్
- అమిర్నేని హరికృష్ణ, అన్నదాత రైతు మాసపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
- సూరంపూడి శివకుమార్, ఐటీసీ అగ్రి, ఐటీ వ్యాపార విభాగం అధిపతి
- చింతల గోవిందరాజులు, నాబార్డ్ ఛైర్మన్
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు
- బ్రిగెడియర్ పోగుల గణేశం, పల్లె సృజన వ్యవస్థాపకులు
- పోపట్‌రావు బాగూజీ పవార్, మాజీ సర్పంచ్, హివారే బజార్, మహారాష్ట్ర
- కూసం రాజమౌళి, మాజీ సర్పంచ్, గంగదేవిపల్లి, తెలంగాణ
- సాబూ ఎం. జాకబ్, సీఎండీ, కిటెక్స్ గార్మెంట్స్, కేరళ
- సుధేంద్ర కుమార్ కులకర్ణి, ప్రముఖ కాలమిస్టు
- సుశీల్ కుమార్ర సింగ్, ఔరంగాబాద్ ఎంపీ, బీహార్
- వి.వి. లక్ష్మీనారాయణ, జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్
- మెసర్స్ టాటా ట్రస్టులు, ముంబై
- మెసర్స్ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్టు
- మెసర్స్ తరుణ్ భగ్ సింగ్, అల్వార్, రాజస్థాన్
- మెసర్స్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ, చందుపట్ల, యాదగిరి భువనగిరి జిల్లా
జీకాట్ చేసేది ఇదీ..
జీకాట్ సంస్థ ప్రధానంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలలో కృషి చేస్తుంది. వ్యవసాయ సహకారం, ఎఫ్‌పిఓ ప్రమోషన్, జంతువుల హాస్టల్, ఎన్ఆర్‌వీ (ప్రవాస గ్రామీణులు), మహిళలు, యువత సాధికారత, ఆరోగ్యం.. ఈ రంగాలపై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. గ్రామవాసులకు శిక్షణ, సామర్థ్యాల పెంపు, మార్కెటింగ్ మద్దతు, మార్కెట్లను అందుబాటులోకి తేవడం, ప్రాజెక్టు నిర్వహణ తదతర కార్యక్రమాలను జీకాట్ చేపడుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జీకాట్‌తో భాగస్వామ్యం వహిస్తోంది. తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048) అనే రకం వరి సేకరణ, శుద్ధికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ రకం వరి వంగడాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయమే రూపొందించింది.
జీకాట్ బృందం ఇదీ..
ఎం. శ్యాంప్రసాద్ రెడ్డి (ఛైర్మన్), బి. ప్రతాప్ రెడ్డి, డాక్టర్ర సత్యేందర్ రామనరసయ్య గోదళ్ల (వైస్ ఛైర్మన్లు), పి. రాంరెడ్డి (ప్రధాన కార్యదర్శి), తన్నీరు వెంకటేశం (కోశాధికారి), సురేష్ బెంజమిన్ (సంయుక్త కార్యదర్శి), ఢిల్లీ వెంకటేష్ (ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), జి.రామేశ్వరరావు, పసుపులేటి వెంకట కిరీటి (సభ్యులు), శ్రవణ్ మడప్ (సీఈఓ), వీకే రాజు (సీఓఓ).











