ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, పండుగ సందర్భంగాకిరాణాలు &ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచేందుకు 12నూతన నగరాల్లోకి విస్తరణ
-12 నూతన నగరాల్లో ఫ్యాషన్ కేటగిరీలో విస్పష్ట విస్తరణ, కిరాణాలుమరియు ఎస్ఎంబీలకు డిజిటల్ కామర్స్ వ్యాపారం మరింత చేరువ
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, భారతదేశం యొక్కకంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క బీ2బీ మార్కెట్ ప్లేస్ దేశంలో 12 కొత్త నగరాల్లోకి విస్తరిస్తున్నట్లు నేడు ప్రకటించింది. రిటైల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించి వన్ స్టాప్ డిజిటల్ మార్కెట్ ప్లేస్ అందుబాటులోకి తేవడంద్వారా చిన్న,మధ్యతరహా వ్యాపారవేత్తలకు విస్తృత శ్రేణి ఎంపిక అవకాశంకల్పించనున్నట్లు ప్రకటించింది. ఫ్యాషన్ కేటగిరీలో ఈ నగరాల్లోకి విస్తరించినఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ కిరాణాలు మరియు ఎంఎస్ఎంఈలు డిజిటల్ మార్పును సొంతంచేసుకోవాలని,తద్వారా వేగంగా వృద్ధి చెంది తమ వినియోగదారులను పరిరక్షించుకోవడంతోపాటుగా లాభాలను సైతం అదే రీతిలో వృద్ధి చెందించుకోవడం లక్ష్యంగా కృషి చేస్తోంది. పండుగను పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ఘజియాబాద్, ఫరిదాబాద్, మైసూర్, చండీఘడ్ట్రైసిటీ, మీరట్,ఆగ్రా,జైపూర్,థానే-బివండి-ఉల్హన్‌సాగర్, గ్రేటర్ ముంబై, వాసయి-విరార్-మీరా-భయనదర్, థానే(కళ్యాణ్-డోండివ్లి) మరియు థానే (నవీ ముంబై) తన సేవలు అందుబాటులోకితెస్తోంది.ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ ఆదర్శ్ మీనన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,“పండుగ సమయం సమీపిస్తున్న తరుణంలో 12 నగరాల్లోకిమేం విస్తరిస్తున్నందుకు,ఎంఎస్ఎంఈలకు మరియు కిరాణదారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నందుకుమేం సంతోషిస్తున్నాం. ట్రెండీ జైపూరీ కుర్తీల నుంచి మొదలుకొని మైసూర్ సిల్క్ చీరలవరకు, చిన్న తరహా వ్యాపారవేత్తలకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవకాశం కల్పించిమరింత శక్తివంతంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోంది. మా సేవలు అందుబాటులోకి వచ్చిననాటి నుంచి అనేక లీడింగ్ బ్రాండ్లతోఒప్పందం కుదుర్చుకున్నాం. డిజిటల్ విప్లవం ద్వారా చిన్నతరహా వ్యాపారేవత్తలుమరియు కిరాణాదారులు సులభంగా వ్యాపారం చేసుకోగలగడం, మైక్రోమార్కెట్ లెవల్ బీ2బీ మరియు బీ2సీ నుంచి ఎదిగేందుకు సహకరించడం,ఫ్లిప్‌కార్ట్ ఎకోసిస్టమ్ ద్వారా వినియోగదారుల యొక్కడిమాండ్‌లను అర్థం చేసుకోవడం,ముఖ్యంగా వారి ప్రాంతంలోని డిమాండ్‌లను అర్థం చేసుకోవడంద్వారా సరైన ఉత్పత్తులు కొనుగోలు చేయడం మరియు అమ్మడం వారికి తెలియజేయగలం.మా కార్యాచరణ వల్ల ఎంఎస్ఎంఈలు,కిరాణాలు ఎంతోవృద్ధి చెందడం ,తద్వారా లక్షలాది కొత్త మరియు నూతన ఉపాధి అవకాశాలుభారతదేశంలో కల్పించడం మాకెంతో సంతోషంగా ఉంది“ అని వెల్లడించారు.ఈ సంవత్సరం చివరి నాటి, హోం & కిచెన్ మరియు గ్రోసరీ కేటగిరీలలోకి విస్తరించాలనే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్కృషి చేస్తోంది. ప్రముఖ బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీలతో కుదుర్చుకున్నఒప్పందం వల్ల ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ వినియోగదారులు సులభంగా రుణ సదుపాయం పొందగలరు.విస్తృత శ్రేణిలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ అష్యూర్డ్ ప్రొడక్ట్స్, సులభంగామరియు సౌకర్యవంతంగా ఆర్డర్ చేయగలగడం మరియు రిటర్న్ చేయడం, వేగంగామరియు నేరుగా సదరు దుకాణానికే ఉత్పత్తులు రవాణా చేయడం, సులభంగాఆర్డర్ ట్రాక్ చేయడం వంటి సౌలభ్యాలు వారు పొందవచ్చు.ఫ్లిప్కార్ట్ హోల్‌సేల్ టీం కలిగి ఉన్న బలమైన మర్చండైజింగ్ అనుభవం వల్ల భాగస్వామ్యులు ప్రయోజనం పొందగలరు. బ్రాండ్లతో కలిగి ఉన్న బలమైన అనుబంధం వల్ల వాటిని మరింతగా ప్రజలకు అనుబంధం చేయడం మరియు మరింతగా అభివృద్ధి చెందించడం మరియు కిరాణాదారులు మరియు చిన్న మధ్యతరహా వ్యాపారవేత్తలకు మరింతగా చేరువ చేయడం, వారిని మరింత ఎదిగేలా చేయడం సాధ్యమవవుతుంది.
భారతదేశ విపణి వృద్ధి పథంలో కొనసాగుతోంది. 12 నగరాల్లో ఈ సేవలు అందబాటులోకి రావడం ద్వారా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వైపు ముందడుగు వేసినట్లు అవుతుంది. కిరాణాలు మరియు చిన్నతరహా వ్యాపారవేత్తలకు వ్యాపార నిర్వహణ మరింత సులభతరం చేయడం ద్వారా భారతదేశ రిటైల్ వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న వీరిని మరింత వృద్ధి పథంలోకి తీసుకువెళ్లడం సాధ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సొంతంగా అభివృద్ధి చేయబడిన టెక్నాలజీ సామర్థ్యాలు, ఈ కామర్స్ కన్జ్యూమర్ సెగ్మెంట్‌లో ఉన్న విస్తృత శ్రేణిలో కలిగి ఉన్న నాయకత్వం వల్ల భారతదేశం యొక్క రిటైల్ పరిశ్రమను మరింతగా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
మరింత సమాచారం కోసం https://flipkartwholesale.com/ను సందర్శించవచ్చు.
గూగుల్ ప్లేస్టోర్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్ యాప్ లభిస్తుంది.