తెలంగాణలో ఎగిరేది భాజపా జెండానే : అరుణ
భవిష్యత్తులో తెలంగాణ బిడ్డలు ఆశలు నేరవేరేది ఒక్క భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతందన్నారు సిద్ధిపేట జిల్లా భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ. రాష్ట్రం సిద్దించిన నుండి నేటికి దొర దగ్గర బానిసలాగే బతుకులు వెల్లదీస్తున్నారని విమర్శించారు. దేశ ప్రధాని మోడీ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా హుస్నాబాద్‌లో ఆశ వర్కర్లు, పారిశ్యుద్ధ కార్మికులు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, మహిళా నేతలు, సిద్ధిపేట జిల్లా భాజపా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా మోడీ ప్రజలకు ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలియజేశారు. అయినా కానీ సిగ్గు లేకుండా తెరాస సర్కార్ అవి తాము చేస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గీతామూర్తి మాట్లాడుతూ…. ప్రజల్లో గుండెల్లో మోడీ ఉన్నారని పేర్కొన్నారు. అతని వల్లే ప్రపంచ పటంలో దేశం గర్వించదగిన స్థాయికి వెల్లిందన్నారు. సంవత్సరాలు పరిష్కారం కానీ ఎన్నో సమస్యలకు ప్రధాని పరిష్కారం చేశారని తెలిపారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్లు తెలంగాణ సర్కార్ పాలిస్తుందని ఆరోపించారు.
అరుణ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణగా మోడీ సర్కార్ ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. అలాగే ఒక్క భాజపాలోనే మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సిద్ధిపేట జిల్లాలో దూది శ్రీకాంత్ రెడ్డి ఇందుకు నిదర్శనమని తెలిపారు. మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కేంద్రంలో మహిళలకు తమ పార్టీ సమూచిత స్థానం కల్పించిదన్నారు.