దుబ్బాక చేసిన పాపం ఏమిటి ?
దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా నియోజకవర్గ యువకుడి ఆవేదన. తెలంగాణ అంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లేనా..?
ఈ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే సరిపోతుందా..?
దుబ్బాక ప్రజలు తెలంగాణ ఉద్యమం చెయ్యలేదా? దుబ్బాక ప్రజలు టీఆరెఎస్ పార్టీకి ఓటెయ్యలేదా?
దుబ్బాక నియోజకవర్గం ఏం పాపం చేసింది..?
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు ఏం పుణ్యం చేసాయి..?
అక్కడ పాలించేది టీఆరెఎస్ ప్రభుత్వమే ఇక్కడ పాలించేది టీఆరెఎస్ ప్రభుత్వమే కదా మరి దుబ్బాక నియోజకవర్గానికే ఎందుకీ దుస్థితి?
తెలంగాణలో మార్పు రావాలని కోట్లాదిమంది ప్రజలు కోరుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాలంటే అది మీ దుబ్బాక నుండే మొదలవ్వాలి, మార్పు జరగాలంటే ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలి ఆ ప్రశ్నించే గొంతుక బిజెపి రఘునందన్ రావు మాత్రమే.
భయం ఎరుగనోడు, కాంట్రాక్టులకు, కమిషన్లకు లాలూచిపడనోడు, నిఖార్సైన ఉద్యమ నాయకుడు, ప్రజలను ప్రేమిస్తాడు, ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తాడు.
పార్టీలకు అతీతంగా ప్రేమించే గొంతుక రఘునందన్ రావు, రఘునందన్ రావు అసెంబ్లీలో ఉంటే తెలంగాణను పట్టి పీడిస్తున్న సకల సమస్యలకు పరిష్కార మార్గం అవుతాడు.