మీరు ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నారా అయితే ఈ చిట్కాలు పాటించండి : స‌్ర‌వంతి

అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేసే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. జలుబుతోపాటు కొందరిని దగ్గు బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే దీనికి ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే డాక్ట‌ర్ స్ర‌వంతి చెప్పిన సూచ‌న‌లు చ‌ద‌వండి. ‌

  • ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదా హెర్బల్‌ టీలో తేనె కలుపుకుని తాగినా దగ్గును తగ్గించుకోవచ్చు.
  • పైనాపిల్‌ పండ్లలో ఉండే బ్రొమెలెన్‌ దగ్గును త్వరగా తగ్గిస్తుంది. పైనాపిల్‌ పండ్లను తినడం ద్వారా దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు.
  • ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించాలి. ఆ తరువాత వచ్చే మిశ్రమాన్ని తాగితే దగ్గు తగ్గుతుంది.
  • ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం, నిమ్మరసం కలుపుకుని తాగితే దగ్గు తగ్గుతుంది.
  • లవంగాలు, దాల్చినచెక్క, అల్లం రసం, మిరియాలు కలిపి వేసి తయారు చేసిన మసాలా టీని తాగడం వల్ల కూడా దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.