అధికంగా వాణిజ్యం జరిపిన బెంచిమార్కు సూచీలు, 11,600 మార్కులను దాటిన నిఫ్టీ, 350 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

నేటి ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ సూచీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

నిఫ్టీ 0.76% లేదా 88.35 పాయింట్లు పెరిగి 11,647.60 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.90% లేదా 353.84 పాయింట్లు పెరిగి 39,467.31 వద్ద ముగిసింది.

ఇండస్ఇండ్ బ్యాంక్ (11.74%), యాక్సిస్ బ్యాంక్ (7.74%), యుపిఎల్ (4.88%), ఎస్బిఐ (4.52%), మరియు ఐసిఐసిఐ బ్యాంక్ (4.41%) నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో ఉండగా, జెఎస్డబ్ల్యు స్టీల్ (2.87%), హీరో మోటోకార్ప్ (2.34%), డాక్టర్ రెడ్డీస్ (1.42%), పవర్ గ్రిడ్ (1.46%), మరియు ఇన్ఫోసిస్ (1.27%) నిఫ్టీ నష్టపోయిన వారిలో ఉన్నారు.

బ్యాంకింగ్ ఇండెక్స్ 4% పైగా పెరిగింది, నిఫ్టీ ఆటో సగం శాతం పడిపోయింది. మెటల్ సూచిక ఎరుపు రంగులో ముగిసింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.55%, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.23% తగ్గాయి.

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్

యుఎస్‌ఎఫ్‌డిఎ హైలైట్ చేసిన ఉల్లంఘనలను, విచలనాలను పరిష్కరించినట్లు కంపెనీ తెలిపింది. నేటి ట్రేడింగ్ సెషన్లో కంపెనీ స్టాక్స్ 1.42% తగ్గి రూ. 4,374.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

ఎ‌స్‌బిఐ

క్రెడిట్ రేటింగ్ సంస్థ ప్రభుత్వ రంగ ఋణదాతల స్టాక్‌లను ‘అమ్మకం’ నుండి ‘కొనుగోలు’ కు అప్‌డేట్ చేసిన తరువాత ఎస్‌బిఐ స్టాక్స్ 4.52% పెరిగి రూ. 225.40 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

ఐసిఐసిఐ బ్యాంక్

ఐసిఐసిఐ సెక్యూరిటీస్ యొక్క 2% వాటాను లేదా 6,442,000 షేర్లను రూ. 310 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించిన తరువాత ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ 4.41 శాతం పెరిగి రూ. 409.50 ల వద్ద ట్రే అయ్యాయి.

ఎన్‌ఎండిసి లిమిటెడ్

నాగర్నార్ ఇనుము మరియు ఉక్కు యూనిట్ యొక్క డీమెజర్ గురించి కంపెనీ ఇటీవల నివేదించింది. గురువారం జరిగిన సమావేశంలో డీమెజర్ ప్రతిపాదనను సంస్థ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. కంపెనీ స్టాక్స్ 11.71% పెరిగి రూ. 107.35 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

ఐడిఎఫ్‌సి లిమిటెడ్.

జూన్ 2020 తో ముగిసిన త్రైమాసంలో కంపెనీ రూ. 26.46 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ మొత్తం ఏకీకృత ఆదాయం రూ.103.99 లకు పడిపోయింది. నేటి ట్రేడింగ్ సెషన్లో కంపెనీ స్టాక్స్ 4.01% పెరిగి రూ. 29.85 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ ఆర్డ్

ఆగస్టు 28 న ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇలో ట్రేడింగ్‌ను తిరిగి ప్రారంభించిన తర్వాత కంపెనీ స్టాక్స్ 4.97% క్షీణించి రూ. 111.95 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ సంస్థను అంతకు ముందు అద్వైత అలయన్స్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ మాక్స్ గ్రూపులో భాగంగా పిలిచేవారు.

భారతీయ రూపాయి

సానుకూల దేశీయ ఈక్విటీ మార్కెట్ల మధ్య అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రూ. 73.39 ల వద్ద ముగిసింది. ఈ వారంలో రూపాయి 1.9% పెరిగింది, ఇది యుఎస్ డాలర్‌తో పోలిస్తే ఈ వారపు అతిపెద్ద పెరుగుదల. ఇంతటి పెరుగుదల చివరిసారిగా 2018 లో కనిపించినది.

మిశ్రమ గ్లోబల్ మార్కెట్ సూచనలు

నేటి సెషన్‌లో ఆసియా మరియు యూరోపియన్ మార్కెట్లు మిశ్రమ ప్రపంచ మార్కెట్ సూచనలను అంచనా వేస్తున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన తరువాత యుఎస్ డాలర్ పెరిగింది. నాస్‌డాక్ 0.34%, నిక్కీ 225 1.41%, హాంగ్ సెంగ్ 0.56% తగ్గాయి. మరోవైపు, ఎఫ్‌టిఎస్‌ఇ 100 0.02%, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 0.12% పెరిగింది.