కోపాన్ని నియంత్రించడం ఎలా ?

మీకు బాగా కోపం వస్తుందా?
అందరి మీద అరుస్తున్నారా? ఆలా ఐతే ఎలా?
కోపాన్ని తగ్గించుకోవడం ఎలానో చూద్దాం!
కోపంగా ఉంటె ఎం చేస్తారు?
ఓ నాలుగు మాటలు అనేస్తారు, ఎదుటి వారి మనసును గాయపరుస్తారు. మీ గురించి తెలిసినవారు ఐతే లైట్ తీసుకుంటారు… కానీ అందరు ఆలా తీసుకోరు కదా, “తన కోపమే తన శత్రువు” అన్నట్లు కోప తపాలా వాళ్ళ మనకిషి గౌరవం కూడా తగ్గుతుంది, తర్వాత తప్పు తెలుసుకొని పశ్చాతాపంతో సారీ చెప్పాలని అనుకున్న చెప్పలేము ప్రతి ఒక్కరికి ఇగో ఫీలింగ్ అడ్డు వస్తుంది. ఇది నిజమే కదా !
కోపం రావడం సరి కాదని మీకు మీరు ఎన్నోసార్లు చెప్పుకున్న ఆవేశం లో కోపాన్ని అదుపులో ఉంచుకోలేము.
కానీ కోపాన్ని నియంత్రించడం అన్నది ప్రశ్న, దానికోసం మనం ఎం చేయాలి అనే అంశాల గురించి డాక్ట‌ర్ స్ర‌వంతి చెప్పే చిట్కాలు మీకోసం.

  1. మనం తీసుకునే ఆహరం:
    అపుడపుడు చాల ఉల్లాసంగా మరియి ఉత్సాహంగా ఉంటారు, కొన్ని రోజులు చాల అలసి పోయినట్టు అనిపిస్తుంది.
    తినే ఆహరం మనసు మరియు మనో భావాలపై చాల ప్రభావితం చేస్తాయి. వాటిని తీసుకోవడం తగ్గిస్తే కోపాన్ని అదుపులో ఉంచవచ్చు. ఉదాహరణ: మాంసాహారం, మసాలా పదార్థాలు నూనెలో వేయించిన పదార్థాలు
  2. విశ్రాంతి:
    మామూలుగా ప్[రతి ఒక్కరు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఆలా పడుకోకపోయిన నిద్రలేమితో తలనొప్పి వస్తుంది, తెల్లారితే చిరాకు కోపం మోదలైతాయి. అందుకే విశ్రాంతి కూడా చాల అవసరం.
  3. యోగాసనాలు:
    ఒత్తిడికి గురి అవుతే కూడా కోపం ఎక్కువగా వస్తుంది. ఒత్తిడి దూరం చేసుకోవాలంటే ప్రొద్దున్నే లేచి వ్యాయామం (వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్స్) ఏదైనా చేయొచ్చు. శ్వాస తీసుకొని వదిలేసే యోగాసనాలు వేస్తే కోపం తగ్గించవచ్చు.
  4. తక్షణ పరిష్కారం:
    కోపం ఉంటె గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త సరఫరా వేగంగా జరుగుతుంది కాబట్టి వెంటనే కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాసను ముక్కుతో తీసుకొని నోటితో వదిలేయాలి. ఆలా శ్వాస తీసుకోవడం వాళ్ళ ఒత్తిడిని దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
  5. ధ్యానం:
    ప్రొద్దున్నే లేచి మీకు వీలైన పద్దితిలో కింద కూర్చొని పది నుంచి పదిహేను నిముషాలు కళ్ళు మూసుకొని ఒకటే దాని మీద ధ్యాస పెట్టాలి.
  6. అంకెలు లెక్క పెట్టడం:
    కోపం లో ఉన్నపుడు ఒకటి నుండి పది వరకు అంకెలను వెనుక నుండి లెక్క పెట్టండి, (10,9,8,7,6,5,4,3,2,1) ఇలా చేస్తే ఆవేశం తగ్గుతుంది.
  7. మైండ్ డివెర్టైన్:
    కోపం లో ఉన్నపుడు మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, పాటలు వినడం, బొమ్మలు వేయడం, పుస్తకాలు చదవడం, వంటలు వెరైటీగా చేయడం, కోపం వస్తే ఎం మాట్లాడతారో తెలియదు కాబట్టి అక్కడ ఉండకుండా బయటికి లేదా పక్కకు వెళ్ళండి.
    ఎవరి మీదైనా కోపం వస్తే పక్కన ఉంటె వెంటనే తిట్టడం లేకపోతే దూరంగా ఉంటె ఫోన్ చేసి తిట్టడం చేయకూడదు. సైలెంట్ గ ఉండడం ఉత్తమం, రెండు రోజులు ఆగితే మీకు కోపం తగ్గుతుంది.
    లైఫ్ ఐస్ బ్యూటిఫుల్:
    కోపం బాగా ఉంటె మీకు కోపం తెప్పించినవారిని తిట్టే బదులు వెంటనే మీ ప్రాణ స్నేహితులకి లేదా మీ కుటుంబంలో మీరు బాగా ఇష్టపడే వారితో ఫోన్ చేసి మాట్లాడి మీ బాధను పంచుకుంటే మీ కోపం కొంత వరకు తగ్గుతుంది.
    అందుకే కోప తాపాలకి వెళ్లి బంధుత్వాలను దూరం చేసుకోకూడదు. జీవితం చాల చిన్నది ఆనందంగా జీవించండి… కోపం ఎక్కువగా వస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే చాల వరకు కికూపం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
    ఇంకా చివరిగా చాల కాలం నుండి మందులు వాడే వారు వాళ్ళకి తెలియకుండానే ( మందుల ప్రభావం వల్ల) అందరి మీద అరుస్తారు.. కాబట్టి మనమే అర్ధం చేసుకొని సైలెంట్ అయిపోవాలి.