భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఉగ్రముప్పు
ఉగ్రవాదుల నుండి తనకు ముప్పు ఉందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తనకు భద్రత పెంచుతూ లేఖ రాశారని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో తన పేరు ఉన్నట్లు పోలీసులు ద్వారా తన దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు పోలీసులు తన ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రత ఏర్పాటు చేశారని వెల్లడించారు. బైక్‌పై తిరగవద్దని, ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలని సూచనలు చేశారని రాజాసింగ్ తెలిపారు. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తన భద్రత పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు.