ఆడ‌వాళ్లు ఏడాదికి ఒక‌సారి ఆ టెస్ట్ చేసుకోవాలి : స‌్రవంతి

సంవత్సారానికి ఒక‌సారి త‌ప్ప‌కుండా ప్ర‌తి మ‌హిళ హెల్త్‌చెక‌ప్ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి. ఆలా చేయడం వాళ్ళ ముందు వచ్చే అనారోగ్యాలను అరికట్టవచ్చు, ముఖ్యంగా మహిళలకు చాల అవసరమ‌ని పేర్కొన్నారు. ఎవరైతే ౩౦ సంవత్సరంలో అడుగు పెడతారో వారు ఎంత ఆరోగ్యంగా ఉన్న ఈ హెల్త్ చెక్-ఆప్స్ తప్పనిసరి చేసుకోవాల‌న్నారు. ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితానికి ఎలాగైతే మనం మంచి ఆహారం, వ్యాయామాలు, తదితర అలవాట్లు అలవర్చుకున్నట్టే మన జీవితంలో ఈ హెల్త్ చెక్-ఆప్స్ లు కూడా భాగమైపోవాలని సూచించారు.
తప్పనిసరి చేయించుకోవాల్సిన టెస్టులు:
ఫిజికల్ టెస్ట్: ప్రతి ఒక్కరికి ఈ టెస్ట్ తప్పనిసరి ఎందుకంటే ఇందులో మన బరువు ఎత్తు బోడీమాస్ ఇండెక్స్, బి పి, పల్స్ రేట్, బ్రీతింగ్ రేట్, వాయిస్, ఇయర్స్, త్రోట్, మెడికల్ హిస్టరీ, ఫామిలీ హిస్టరీ, ఆల్కహాల్ / స్మోకింగ్ హబిట్స్, స్ట్రెస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు, ఇవన్నీ ముందుగా చేయించువడం వల్ల హై బి పి, టైపు త్వో డయాబెటిస్, హార్ట్ ప్రోల్మ్స్ ఇంకా కాన్సర్ రాకుండా నివారించవచ్చు.
బి పి:
కేవలం బి పి చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్లలేం కాబట్టి ప్రతి ఒక్కరు బి పి ఆపరేటర్ మెషిన్ కొనిగోలుచేసుకోగలరు.
నార్మల్ బి పి: 120/80 నుంచి 139/89
హై బి పి: 140/90 లేక ఎక్కువ ఉంటె
లౌ బి పి: 100/60
హై బి పి, లో బి పి ఇలా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించగలరు.
కొలెస్ట్రాల్: మగవారితో పోల్చుకుంటే ఆడవారికి ఈ టెస్ట్ చాలా అవసరం.
ఒక్కసారి చేయించుకుంటే నార్మల్ వస్తే 5 సంవస్త్సరాలకీ ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుంది.
బ్రెస్ట్ టెస్ట్: ప్రతి మహిళా తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్ట్. బ్రెస్ట్ కాన్సర్ అనేది ఇండియాలో చాలా ముఖ్యమైన క్యాన్సర్ గా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం 2.1 మిలియన్ మహిళలకు వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మమ్మో గ్రామ్ అనే టెస్ట్ ద్వారా నిర్దారించబడుతుంది.
ప్రతి నెల మీకు మీరే ఇంట్లోనే బ్రెస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు కరెక్టుగా తెలుస్తుందంటే ఈరోజు నెలసరి మొదలైతే మరుసటి ఆరు నుంచి ఎనిమిది రోజుల లోపు ఏమైనా తేడా కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించగలరు.
పాప్స్మెర్ టెస్ట్:
ఇది కూడా ప్రతి మహిళా తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి చేయించుకోవాల్సిన టెస్ట్.
దీని వల్ల గర్భాశయ కాన్సర్ ఇంకా తదితర కాన్సర్లు ఏమైనా ఉంటె తెలుస్తుంది, ఆలా ముందుగా తెలుసుకుంటే మనం ఈ క్యాన్సర్లను నివారించవచ్చు.
డయాబెటిస్ /బ్లడ్ షుగర్ టెస్ట్:
మామూలుగా మనకి బాగా ఆకలి వేస్తే తరచూ మూత్ర విసర్జన జరిగితే అనుమానంతో చెక్ చేయించుకుంటాం కానీ మన ఫ్యామిలీలో ఎవరికీ ఐన ఉన్న లేక అధిక బరువుతో బాధపడుతున్న తప్పనిసరిగా ప్రతి ఏడాది ఈ టెస్ట్ చేయించువాలి.
ఐ టెస్ట్:
రెండు సంవత్సరాలకి ఒకసారి తప్పనిసరిగా అందరు చేయించుకోవాలి. డయాబెటిస్ తో బాధపడేవారు ఏడాదికి ఒకసారి టెస్ట్ చేయించువాలి.
డెంటల్ టెస్ట్:
ఇది కూడా ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా టెస్ట్ మరియు క్లీనింగ్ చేయించుకోవాలి.
ఈ టెస్ట్ లో, మన దంతాలు చిగుర్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.
డయాబెటిస్, బాగా ప్రోగ తాగుట అలవాటు ఉన్నవాళ్లు తరచూ ఈ టెస్ట్ చేయించుకోవాలి.