ఏటిగ‌డ్డ కిష్ట‌పురానికి ఏ క‌ష్టం రానివ్వ‌ను : ర‌ఘునంద‌న్‌రావు

రాష్ట్ర సీఎంగా ఏటిగ‌డ్డ కిష్టాపురానికి చేసిన అన్యాయానికి తాను భవిష్య‌త్తులో ఏ క‌ష్టం రాకుండా చూసుకుంటాన‌ని దుబ్బాక భాజ‌పా నేత ర‌ఘునంద‌న్‌రావు అన్నారు. ఆ గ్రామ ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బడి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌ని తెలిపారు. ఇటీవ‌ల ఆ గ్రామంలో ప‌ర్య‌టించిన ఆయ‌న ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. రైతుల‌కు అన్యాయం చేసిన తెరాస స‌ర్కార్‌కి త‌గిన బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల కోసం అనేక ప‌థ‌కాల‌ను తీసుకొచ్చింద‌ని తెలిపారు. కానీ రాష్ట్ర స‌ర్కార్ త‌మ ఖాతాలో వేసుకుంటున్నాయ‌ని విమ‌ర్శించారు.