దుబ్బాకలో రంగులు మారుతున్న రాజకీయం
దుబ్బాకలో ఇప్పుడే రాజకీయం తారస్థాయికి చేరింది. రేపో, మాపో ఎన్నికలు ఉన్నట్లు హడవుడి మొదలైంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ( భాజపా), తెలంగాణ రాష్ట్ర సమితి (తెరస) ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నెల ఉంది పరిస్ధితి. భాజపాకి చెందిన రఘునందన్‌రావుకి సంబంధించిన పాత వీడియోలను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. దానికి భాజపా నేతలు కూడా అంతే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు. ఎన్నికల తేదీలు కూడా ఖరారు కాకముందే ప్రచారం ఈ స్థాయిలో ఉంటే, ఎన్నికల నగర మోగితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సారి ఖచ్చితంగా భాజపా జెండా దుబ్బాకలో ఎగరడం ఖాయం అన్నట్లు ధీమాగా ఉన్నారు నేతలు, అంతే కాకుండా భారీగా మోజార్టీ కూడా వస్తుందంటున్నారు. ఇటీవల కాలంలో నియోజకవర్గ గ్రామాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగా భాజపాకే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీఎం సొంత జిల్లా కావడం వల్ల కొద్దిగా టఫ్ ఫైట్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ తెరాస ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పనుల వల్ల వచ్చిన వ్యతిరేకత ఓటు రూపంలో ప్రజలు భాజపాకు పట్టం కడతారని ధీమాలో రఘునందన్‌రావు ఉన్నారు.