కరీంనగర్ పెళ్లి బరాత్‌లో పెళ్లికూతురికి అక్కడ ముద్దు పెట్టిన ప్రియుడు…చివరికి
ఇలాంటి సీన్లు అన్నీ మనం సినిమాల్లో మాత్రమే చూస్తాం కానీ కరీంనగర్‌లో ఆ సీన్ నిజమైంది. ఈ సీన్ ఏంటీ అనుకుంటున్నారా అయితే ఈ కథనం చదవండి.
పెళ్లి బరాత్‌లో ప్రియుడి గొడవ కారణంగా మూడుగంటలకే పెళ్లి పెటాకులైన సంఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. హుజురాబాద్‌కి చెందిన దివ్య అదే పట్టణానికి చెందిన వంశీని ప్రేమించింది. ఆమె ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయించారు. పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు. అనంతరం పెళ్లి బరాత్‌కి సిద్ధమవుతున్న తరుణంలో ఆమె ప్రియుడు ఎంట్రీ ఇచ్చి ఊహించని షాకిచ్చాడు.
ఆమెను తాను ప్రేమించానని.. ఎలా పెళ్లి చేసుకుంటావంటూ గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న ప్రియుడు పెళ్లింట హంగామా సృష్టించాడు. ప్రేమిస్తున్నానంటూ ఏకంగా వధువుకి ముద్దు పెట్టడంతో అంతా కంగుతిన్నారు. పెళ్లికూతురి ఇంటి నుంచి ఊరేగింపుగా బయలుదేరుతుండగా కారును అడ్డుకున్నాడు. దీంతో ఒక్కసారిగా గందరగోళం రేగింది. పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. అయితే పోలీసు విచారణలో పెళ్లికూతురు వరుడికి షాకిచ్చింది. తాను వంశీని ప్రేమిస్తున్నానని.. అతనితోనే ఉంటానని చెప్పడంతో అవాక్కవడం పెళ్లికొడుకు వంతైంది. కథ అడ్డం తిరగడంతో ఇక చేసేది లేక వరుడు ఒంటరిగా ఇంటిముఖం పట్టాడు.