లవంగాలు తింటే ఎన్నో ప్రయోజనాలు : స‌్రవంతి
లవంగాలు తినడానికి చాలా మంది ఇష్టపడరు కానీ వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డాక్టర్ స్రవంతి. లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి డాక్టర్ చెప్పిన వాటిని ఇక చదవండి.
సమయం వచ్చినప్పుడు పెద్దలు చెప్పిన మాటలు వినాలి. వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి నిత్యం పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ ఈ జెనరేషన్ వాళ్లు ఎవరూ పట్టించుకోరు. కరోనా మహమ్మారి వచ్చింది కదా. వద్దన్నా అడిగి చెప్పించుకుంటున్నారు. అంతటి ప్రాముఖ్యత చెందిన ఇంగ్రీడియంట్స్‌లో లవంగాలు ఒకటి. మరి కరోనా టైంలో వీటిని తినడం వల్ల ఎంత మంచి చేకూరుతుందో ఓ సారి తెలుసుకోండి.
- కరోనా టైంలో కావల్సింది ఒకే ఒక్కటి రోగనిరోధక శక్తి. లవంగాలు ఆ శక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది.
- చర్మ సమస్యలతో బాధపడేవారికి లవంగాలు ఉపశమనాన్నిస్తాయి. ఆ సమయంలో లవంగాలను చందనంతోపాటు రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూతలా పూసుకుంటే చర్మ వ్యాధులు మాయమవుతాయి.
- లవంగాల నుంచి నూనె తీస్తారు. అలా నూనె తీయని లవంగాలు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- తెల్ల రక్తకణలను పెంపొందించే సత్తా లవంగాలకు ఉంది. ఇది మనిషి లైఫ్‌టైంని పెంచుతుంది.
- నోటి నుంచి చెడు వాసన వస్తుంటే రెండు లవంగాలను నోట్లో వేసుకోండి. అలా వేసుకుంటే నోరు తాజాగా ఉండడంతోపాటు మంచి సువాసన ఇస్తుంది.
- తిన్న ఆహారం జీర్ణం కాకపోతే లవంగాలు సేవించడం బెటర్. దీంతో జీర్ణం సాఫీగా జరుగుతుంది.
- లవంగాలు తింటే మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు ఐదు లవంగాలకు మించి శరీరంలోకి పంపకూడదు. లేదంటే శరీరంలో వేడి ఎక్కువవుతుంది.
- కఫం, పిత్త రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ లవంగాలు సేవించేలా చూసుకోవాలి. ఇలా చేస్తే వెంటనే ఫలితం ఉంటుంది.