తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు
తెలంగాణలో అధికారం చేజిక్కించేకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి పని మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారీ మార్పులు చేయడానికి శ్రీకాం చుట్టింది. త్వరలో పార్టీ ఇంఛార్జీల నుండి కింది స్థాయి వరకు మార్పులు చేయాలనే ఆలోచనలో హస్తిన నేతలు ఉన్నట్లు సమాచరాం. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ పరిణామాలను రాష్ట్ర నేతలు ఉదయం నుంచి జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. మీటింగ్ తీర్మానాలను మీడియాకు విడుదల చేశారు. ఇందులోని అంశాలతోపాటు సమావేశం జరిగిన తీరుపై రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉండి తెలుసుకున్నారు. పార్టీకి డైనమిక్, యాక్టివ్ నేతలు నాయకత్వం వహించాలని 23 మంది కాంగ్రెస్ పెద్దలు రాసిన లెటర్‌కు అనుగుణంగానే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని సీడబ్ల్ యూసీ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మార్పులు చేసేందుకు సర్వాధికారాలను సోనియా, రాహుల్ గాంధీల చేతిలో పెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇన్ని రోజులుగా ప్రక్షాళనకు అడ్డుపడుతూ వస్తున్న నేతలు, ముఖ్యంగా సీనియర్లకు, ఇకపై ఆ అవకాశం లేకుండా పోతుంది. పార్టీ కోసం కష్టపడి పని చేసే వాళ్లకే అవకాశాలు దక్కుతాయని సంతోషంతో ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు చెక్ పడుతుందని సంబరపడుతున్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్?
రాష్ట్రంలో పీసీసీ మార్పు గురించి ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. తాను బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఎన్నికల తర్వాత ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీకి లేఖ రాశారు. కానీ పలు కారణాలతో అధిష్టానం ఆయననే కొనసాగిస్తూ వచ్చింది. ఉత్తమ్ కూడా రాష్ట్ర పార్టీ అధినేతగా తన కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కానీ పార్టీలో ని అనేక మంది నేతలు ఆయన నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపడతారనే ప్రచారం జోరుగా సాగింది. పార్టీ సీనియర్ నేతలు ఇలాంటి ప్రపోజల్స్ అధిష్టానానికి చేరకుండా ఏకమయ్యారు. అయినా పార్టీలో ప్రచారం మాత్రం జరుగుతూనే వస్తోంది.
యువతకే పెద్దపీట
పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ముందు నుంచీ యూత్ కు, పార్టీకి దశాబ్దాలుగా విధేయులుగా ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వా లనీ చెబుతూ వస్తున్నారు. వీలైనంత వరకు ఆయన కొన్ని మార్పు లు చేస్తూ వచ్చారు. ఫలితంగా ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ నేతలైన చల్లా వంశీచంద్ రెడ్డి , సంపత్ కుమార్ లాంటి యువ నేతలకు ఏఐసీసీ సెక్రటరీలుగా అవకాశాలు వచ్చాయి. దాసోజు శావ్రణ్ కుమార్ కు ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ గా చాన్స్ దక్కిం ది. సోనియాకు లేఖ రాసిన 23 మంది నేతల్లో రాష్ట్రం తో సంబంధం ఉన్న గులామ్ నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ (రాష్ట్ర మాజీ ఇంచార్జీలు), మాజీ ఎంపీ రేణుకా చౌదరిలకు సీడబ్ల్ యూసీ పరిణామాలతో చెక్ పడుతుందని అనుకుంటున్నారు. వీళ్లకు సన్నిహితంగా మెలిగే నేతలకూ పదవుల విషయంలో నిరాశే ఎదురు కావచ్చని చెప్తున్నారు.