తెలంగాణ‌లో ల‌క్ష దాటిన‌ క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోన త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. ఇప్ప‌టికే క‌రోనాతో వంద‌ల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వచ్చింద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. గ‌త శాస‌న‌స‌భ స‌మావేశాల్లో వాడి వేడి చ‌ర్చ‌లు జరుతున్న స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ చెప్పినా… ఆ స‌మయంలో కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు. మొద‌ట హైద‌రాబాద్‌లోనే ఎక్కేవ‌గా కేసులు న‌మోదు కాగా రాను రాను జిల్లా కేంద్రాలు, గ్రామాల‌ను వైర‌స్ తాకింది. దీంతో ప్ర‌జ‌లు క‌నీస ప‌నులు చేసుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్నారు.
తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2,474 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,865 కు చేరింది. ఇందులో 78,735 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 22,386 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతునే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రాంలో కరోనాతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 744కు చేరింది. అలాగే, తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ-447 కేసులు నమోదయ్యాయి.